27-10-2025 12:40:11 AM
పార్క్‌లో ‘పుస్తక పఠనం చేద్దాం’ కార్యక్రమాన్ని ప్రారంభించిన కలెక్టర్ రాజర్షి షా
ఆదిలాబాద్, అక్టోబర్ 26 (విజయక్రాం తి): పుస్తకాలు చదవడం ద్వారా ఆలోచనా శక్తి, జ్ఞానం అభివృద్ధి చెందుతోందని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ఆదివారం స్థానిక గాంధీ పార్క్‌లో నిర్వహించిన పుస్తక పఠనం చేద్దాం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్, పుస్తక పఠనం కార్య్ర కమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంలో కలెక్టర్, స్థానిక పార్కులో పిల్లల లైబ్రరీ ఏర్పాటుకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు. అంతకుముందు పలువురు పాఠకులు కలెక్టర్కు పుస్తకాలను బహూకరించారు. అనం తరం క్రీడా పాఠశాల విద్యార్థులకు యూనిఫార్మ్లను కలెక్టర్ అందజేశారు. అదేవిధంగా తెలంగాణ సారస్వత పరిషత్ గౌరవ సభ్యు డు, సాహితీవేత్త సామల రాజవర్ధన్ను జిల్లా కలెక్టర్ సన్మానించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పుస్తకాలు మనలో ఆలోచనలను పెంచుతాయని, అవి మన జ్ఞానాన్ని విస్తరింపజేస్తాయన్నారు. చదివిన పుస్తకాల్లో నచ్చిన అంశాలను చర్చించడం ద్వారా ప్రజల్లో, విద్యార్థుల్లో పఠనపట్ల ఆసక్తి పెరుగుతుందన్నారు. సమయం దొరికినప్పుడల్లా ఒక మంచి పుస్తకాన్ని చదవడం అల వాటు చేసుకోవాలని సూచిస్తూ, పుస్తకాలలోని మంచి విషయాలను నేర్చుకొని ఆచ రణలో పెట్టడం ద్వారా సమాజానికి ఉపయోగపడే పౌరులుగా ఎదగాలని చెప్పారు.
గ్రంథాలయాల్లో ఎన్నో విలువైన పుస్తకాలు అందుబాటులో ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్ర మంలో డివైఎస్‌ఓ శ్రీకాంత్, డిసీఈబీ సెక్రటరీ గణేందర్, అశోక్, రవీందర్ రెడ్డి, జిల్లా లోని కవులు, కళాకారులు, సాహితీవేత్తలు, రచయితలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.