హెచ్.మ్యాట్ ఆధ్వర్యంలో హోమియోపతి వైద్యంపై సెమినార్
ముషీరాబాద్, ఆగస్టు 18(విజయక్రాంతి): హోమియోపతిక్ మెడికల్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ(హెచ్. మ్యాట్), హిమాయత్నగర్ ఆధ్వర్యంలో కందుల వెంకట నర్సింగరావు, మాణిక్యం, డా.గౌరీబాయి కీర్తనే స్మారకార్థం జూపల్లి బాలమ్మ ఆడిటోరియంలో సెమినార్ నిర్వహించారు. హెచ్.మ్యాట్ అధ్యక్షుడు డా.కె. గోపాలకృష్ణ, ప్రధాన కార్యదర్శి డా.జి.దుర్గాప్రసాద్ రావు పాల్గొన్నారు. స్పాన్సర్గా స్టార్ హోమియోపతి అధినేత డా.కె.ఎస్.గుప్త వ్యవహరించారు.
డా.గణేష్ ఆచారి, డా.అన్నపూర్ణ మంతా, ప్రొ.డా.గోరంట్ల చంద్రశేఖర్ రావు హోమియోపతి, మధుమేహ సమస్యలు, సోరియాసిస్, క్యాన్సర్ చికిత్సపై ప్రసంగించారు. డా.వేణుగోపాల్ గౌరీ ముగింపు వ్యాఖ్యలు చేశారు. డా.సి.వి. స్వామి, డా.మధు వారణాసి, డా.కల్పన కృష్ణ, డా.రాజేశ్రీ షా, డా.సతీష్ కృష్ణ, డా. సాయిశ్రుతి, డా.హర్షిత వూరే, డా.గౌతమ్ రాళ్లబండి తదితరులు పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో వైద్యులు, విద్యార్థులు, ఇంటరన్స్, పోస్ట్గ్రాడ్యుయేట్లు హాజరయ్యారు.






