calender_icon.png 29 June, 2025 | 1:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ర్యాంకర్లకు సెమ్స్ నేషనల్ అవార్డులు

29-06-2025 01:26:15 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 28 (విజయక్రాంతి): విద్యలో అత్యంత ప్రతిభ కనబరిచి రాష్ట్ర, జాతీయ స్థాయిలో నేషనల్ ర్యాంకులు సాధించిన విద్యార్థులకు సెమ్స్ ఒలంపియాడ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అవార్డులు ప్రధానోత్సవం చేశారు. శనివారం బాగాలింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సెమ్స్ కన్వీనర్ అరుకాలు రామచంద్రారెడ్డి అధ్యక్షతన సెమ్స్ నేషనల్ అవార్డ్స్ ప్రధానోత్సవ కార్యక్రమం జరిగింది.

ముఖ్య అతిథిగా హైదరాబాద్ డిప్యూ టీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి హాజరై విద్యార్థులకు బహుమతులు, మెమొంటోలు, అవార్డులతో పాటు నగదు బహు మతి అందించారు. కార్యక్రమంలో 300 మందికి పైగా విద్యార్థులకు అవార్డులు, బహుమతులు ప్రధానం చేశారు. విద్యార్థులతో పాటుగా వారి తల్లిదండ్రులను ఘనం గా సన్మానించారు.

కార్యక్రమంలో అధ్యక్షుడు రాఘవ, సెమ్స్ డైరెక్టర్స్ జయప్రసాద్, శేఖర్, అస్లాం, సామ శశికళ, ట్రస్మా అధ్యక్షుడు ఎస్‌ఎన్ రెడ్డి అతిథులుగా హాజరయ్యా రు. ఒలంపిక్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మల్లారెడ్డి, ప్రముఖ మోటివేటర్ కేవీ ప్రదీప్ కుమార్, వివిధ పాఠశాలల రెస్పాండెంట్స్ ట్రస్మా నాయకులు అనిల్ కుమార్, శ్రీకాంత్‌రెడ్డి, చింతల రామచందర్ తదితరులు పాల్గొన్నారు.