29-06-2025 02:57:41 AM
హైదరాబాద్,సిటీ బ్యూరో జూన్ 28 (విజయ క్రాంతి) : భారతరత్న మాజీ ప్రధాని పీవీ నరసింహారావు సమసమాజ స్థాపనకు పునాదులు వేసిన గొప్ప సంఘ సంస్కర్త అని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కొనియాడారు. పీవీ జయంతి సందర్భంగా శనివారం నెక్లెస్ రోడ్డులోని పీవీ ఘాట్ వద్ద ఆయన ఘన నివాళులు అర్పించారు. అనంతరం మీడియా తో మాట్లాడుతూ, పీవీ చూపిన మార్గంలోనే తమ ప్రజా ప్రభుత్వం పయనిస్తుందని స్పష్టం చేశారు.
పీవీ రాష్ర్ట మంత్రిగా, ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా, ప్రధానిగా దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయమని, ఆయన మన తెలంగాణ గడ్డపై జన్మించినందుకు మనకెంతో గర్వకారణమని డిప్యూటీ సీఎం అన్నారు. దేశానికి మొట్టమొదటి మానవ వనరుల శాఖ మంత్రిగా.. అందరికీ ఒకే రకమైన విద్య అందాలన్న ఆశయంతో నూతన విద్యా విధానానికి పీవీ పునాదులు వేశారని గుర్తుచేశారు. తీవ్ర ఆర్థిక, రాజకీయ సంక్షోభంలో ఉన్న దేశాన్ని ప్రధానిగా బాధ్యతలు చేపట్టి, ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని గాడిలో పెట్టారని భట్టి తెలిపారు.
తాక ట్టులో ఉన్న మన దేశ బంగారాన్ని విడిపించి, ఆర్థిక సంస్కరణలతో ప్రపంచ పటం లో భారతదేశాన్ని ఒక బలమైన శక్తిగా నిలబెట్టిన ఘనత పీవీదే అని ఆయన ప్రశం సిం చారు. ప్రధాని ఇందిరాగాంధీ తెచ్చిన భూ సంస్కరణలను ముఖ్యమంత్రిగా పీవీ నరసింహారావు పటిష్టంగా అమలు చేసి, కాంగ్రెస్ హయాంలో 24 లక్షల ఎకరాల భూ మిని పేదలకు పంపిణీ చేశారని భట్టి గుర్తుచేశారు.
కానీ గత పదేళ్ల పాలకులు ‘ధరణి’ పేరుతో పేదలను ఇబ్బందులకు గురిచేసి, వారి భూములను అన్యాక్రాంతం చేశారని విమర్శించారు. నాడు కాంగ్రెస్ పంచిన భూ ములను తిరిగి పేదలకే దక్కేలా, వారి అస్తిత్వాన్ని, హక్కులను కాపాడేందుకే తమ ప్ర భుత్వం ‘భూ భారతి’ చట్టాన్ని తీసుకువచ్చిం ది. పీవీ నరసింహారావు చూపిన మార్గాన్ని తమ ప్రజా ప్రభుత్వం తూచా తప్పకుండా అమలు చేస్తుందని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.
నిరాడంబర జీవి
మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. విద్యా రంగం బలోపేతానికి పీవీ ఎంతగానో కృషి చేశారన్నారు. ఆయన హయాంలోనే నవోదయ విద్యాలయాలు ఏర్పాటై లక్షలాది మంది గ్రామీణ విద్యార్థులకు నాణ్య మైన విద్య అందిందని కొనియాడారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడు తూ.. పీవీ నరసింహారావు ఆలోచనా ఫలితమైన నవోదయ పాఠశాలల ఈ రోజు దేశ విద్యా రంగంలో ఎంతగానో కీలక పాత్ర పోషిస్తున్నాయన్నారు.
రాజీవ్‌గాంధీ ఆశయాలతో పీవీ తన హయాంలో తీసుకున్న గొప్ప నిర్ణయాలు తమ గ్లోబలైజేషన్, లిబరలైజేషన్ విధానాలు ఎంతగానో ప్రభావం చూపాయని, ఈ రోజు దేశంలో ప్రైవేటు పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందడానికి వారి ఇరువురే కారణమన్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. నేడు భారత్ 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదిగేందుకు పీవీ చేపట్టిన సంస్కరణలే పునాది అని చెప్పారు.
ఆయన గుర్తుగా శంషాబాద్ విమానాశ్రయానికి నిర్మించిన ఫ్లై ఓవర్‌కు ‘పీవీ ఎక్స్‌ప్రెస్ వే’ అని పేరు పెట్టుకున్నామని అని గుర్తుచేశారు. పీవీ ఘాట్ వద్ద జరిగిన ఈ కార్యక్రమానికి బీజేపీ నాయకుడు ఎంపీ డాక్టర్ కే లక్ష్మణ్, పీవీ కుమారుడు ప్రభాకర్‌రావు, ఎన్‌వీ సుభాష్, పొంగులేటి సుధాకర్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు.
బహు భాషా కోవిదుడు పీవీ
మాజీ ప్రధానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నివాళి
హైదరాబాద్, జూన్ 28 (విజయక్రాంతి): బహు భాషా కోవిదుడిగా, రచయితగా, ఆర్థిక సంస్కరణల పితామహుడిగా మాజీ ప్రధాని, భారతరత్న పీవీ నర్సింహారావు దేశానికి ఎనలేని సేవలు అందించారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కొనియాడారు. పీవీ జయంతి సందర్భంగా శనివారం జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ఆ మహనీయుని చిత్రపటానికి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా పీవీ సేవలను ఆయన గుర్తుచేసుకున్నారు. దేశాన్ని ప్రగతిపథంలో నడిపించడంలో పీవీ పాత్ర ఎనలేనిదన్నారు. ఈ కార్యక్రమంలో సీఎం సలహాదారు వేం నరేంద్‌రెడ్డి, ఎమ్మెల్యేలు మందుల సామేల్, మట్టా రాగమయి, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేశ్‌రెడ్డి పాల్గొన్నారు.
పీవీ స్వగ్రామం వంగరలో ఘనంగా జయంతి వేడుకలు
భీమదేవరపల్లి, జూన్ 28 (విజయక్రాంతి): మాజీ ప్రధాని, భారతరత్న స్వర్గీయ పీవీ నరసింహారావు స్వగ్రామం వంగరలో పీవీ ప్రభాకర్‌రావు సౌజన్యంతో పీవీ మ్యూజియం ప్రాంగణంలో ఆయన జయంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. కార్యక్రమంలో పీవీ కుటుంబ సభ్యులు, గ్రామస్తులు హాజరయ్యారు. పీవీ సోదరుడి కుమారుడు పీవీ మదన్‌మోహన్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం పీవీ జయంతి, వర్ధంతి కార్యక్రమాలను వంగరతోపాటు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించేలా ఉత్తర్వులివ్వాలని సీఎం రేవంత్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు.
పీవీ ఒక ప్రయోగశాల లాంటివారని కొనియాడారు. రైతాంగం కేవలం వ్యవసాయాధారిత పంటలపై ఆధారపడొద్దని, ఇతర పంటలపై ఆసక్తి చూపే విధంగా వంగరలో పాడిపరిశ్రమ, చెరకు, పత్తి, కోళ్ల పరిశ్రమ తానే చేపట్టి ఉన్నతంగా నిలిచారని పేర్కొన్నారు. భీమదేవరపల్లి ఎమ్మార్వో రాజేశ్ మాట్లాడుతూ.. ప్రధానిగా వీపీ ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణల వల్ల భారత్, ప్రపంచదేశాల్లో సుస్థిర స్థానాన్ని పొందగలిగిందని కొనియాడారు. ప్రభత్వాలు ఆయన చూపినబాటను అనుసరిస్తూ ముందుకు సాగుతున్న విషయాన్ని గుర్తు చేశారు. సాఫ్ట్‌వేర్ రంగం పీవీ చూపిన చొరవేనన్నారు.
పీవీ సేవలను స్మరించుకోవాలి
హైదరాబాద్, జూన్ 28 (విజయక్రాంతి): తెలుగు తేజం, గొప్ప రాజనీతిజ్ఞుడు, భారతరత్న, ప్రధానమంత్రి పదవిని చేపట్టిన తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ నరసింహారావు జయంతి సందర్భంగా ఆ మహానుభావుడు దేశానికి చేసిన సేవలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాల్సిన అవసరం ఉందని కేంద్ర మం త్రి బండి సంజయ్ పేర్కొన్నారు. పీవీ నర్సింహారావు రాజకీయవేత్త మాత్రమే కాదు... బహుభాషావేత్త, కవి, రచయిత, జర్నలిస్టు, అనువాదకుడిగా అపార జ్ఞానం సంపాదించిన మహోన్నతుడు పీవీ అని కొనియా డారు.
తన భూములను పేదలకు పంచి ఉ మ్మడి రాష్ర్టంలో భూ సంస్కరణలకు బీజం వేసిన భూదాత అని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దేశం ఆర్ధికంగా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో ప్రధానిగా పీవీ చేపట్టిన సంస్కరణలు దేశ ఆర్ధిక ప్రగతికి పునాది వేశాయన్నారు. పీవీ జన్మించిన వంగరలో పీవీ జ్ఞాన వేదికను ఏర్పాటు చేస్తామని ప్రకటించిన బీఆర్‌ఎస్ ఆ హామీని విస్మరించిం దన్నారు. ఇకనైనా వాటిని సత్వరమే పూర్తి చేయాలని రాష్ర్ట ప్రభుత్వాన్ని కోరారు.