calender_icon.png 27 June, 2025 | 10:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్టేడియం నిర్మాణానికి అవసరమైన ప్రతిపాదనలు పంపండి

27-06-2025 05:42:56 PM

హుజురాబాద్,(విజయక్రాంతి): హుజరాబాద్ లో మినిస్టర్ ఏర్పాటు చేయాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్(Union Minister of State for Home Affairs Bandi Sanjay)కి బిజెపి జిల్లా అధ్యక్షుడు గతంలోవినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బండి సంజయ్ స్టేడియంకి అవసరమయ్యే ప్రతిపాదనలు పంపించాలని హుజరాబాద్ మున్సిపల్ కమిషనర్ సమ్మెను కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మున్సిపల్ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేసి ప్రతిపాదనలు పంపాలని కమిషన్ కోరారు. కమిషనర్ సమ్మయ్య స్పందించి పంపిస్తానని తెలిపారు. ఈ సందర్భంగా కృష్ణారెడ్డి మాట్లాడుతూ... గత బిఆర్ఎస్ ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మినిస్ట్రీయం నిర్మిస్తామని హామీలిచ్చి అమలు చేయలేదన్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హుజురాబాద్లో మినీ స్టేడియం ఏర్పాటు చేస్తామని ప్రతిపాదనలు పంపించమని, హుజరాబాద్ ప్రాంతంలో ఎంతోమంది ప్రతిభ వంతులైన క్రీడాకారులు ఉన్నారని, స్టేడియం లేక ఇబ్బందులకు గురవుతున్నారని, మున్సిపల్ కమిషనర్ తో చర్చించి ప్రతిపాదనలు పంపించామని పేర్కొన్నారు.