calender_icon.png 27 July, 2025 | 5:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎంజీఎం ఆసుపత్రిలో ఊడి పడిన స్లాబ్ పెచ్చులు

27-06-2025 05:37:58 PM

వరంగల్,(విజయక్రాంతి): వరంగల్ నగరంలోని ఎంజీఎం ఆసుపత్రిలోని పురుషుల సర్జికల్ వార్డులో శుక్రవారం ఉదయం స్లాబ్ పెచ్చులు ఊడి కింద పడ్డాయి. అయితే ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిపోయింది. ఎంజీఎం ఆస్పత్రిలోని పలు వార్డుల పైకప్పులు దెబ్బతిన్నాయి. ఇదే వార్డులో ఇటీవల టాయిలెట్లలో పైకప్పు పెచ్చులూడి పడిపోవడంతో పురుగులు గాయపడ్డారు. ప్రతి వర్షాకాలంలో ఇదే తరహాలో ఘటనలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడంలేదని విమర్శలు వస్తున్నాయి. సెంట్రల్ జైలు తొలగించి కొత్తగా నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వల్ల ఎంజీఎం ఆస్పత్రి సౌకర్యాలపై అధికారులు చిన్నచూపు చూస్తున్నారని రోగులు, ప్రజలు ఆరోపిస్తున్నారు. కొత్త ఆసుపత్రి నిర్మించేంతవరకు ఇలాంటి ఘటనల వల్ల ప్రాణాలు కోల్పోతే బాధ్యులు ఎవరని ప్రశ్నిస్తున్నారు. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభించేంతవరకు ఎంజీఎం ఆస్పత్రి నిర్వహణను పట్టించుకోవాలని, ఇటువంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Slab Collapse In Warangal MGM Hospital