calender_icon.png 4 July, 2025 | 3:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీజేపీ సీనియర్ నాయకుడు హరికుమార్ గౌడ్ మృతి

04-07-2025 12:00:00 AM

కరీంనగర్, జూలై 3 (విజయ క్రాంతి): బిజెపి సీనియర్ నాయకుడు తాళ్లపల్లి హరికుమార్ గౌడ్ గురువారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు, భార్య ఉన్నారు. హరికుమార్ గౌడ్ గత 35 సంవత్సరాల పైచిలుకు బిజెపి పార్టీలో క్రియాశీలకంగా పని పనిచేస్తున్నారు. ఆయన బిజెపి నగర అధ్యక్షుడిగా, బిజెపి కరీంనగర్ పార్లమెంట్ కన్వీనర్ గా బాధ్యతలు నిర్వహించారు.

మాజీ హోం శాఖ సహాయ మంత్రి విద్యాసాగర్ రావు ఆయన శిష్యుడు. పలువురు సంతాపం..బిజెపి సీనియర్ నాయకుడు తాళ్లపల్లి హరికుమార్ గౌడ్ మృతి పట్ల కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సంతాపం తెలిపారు. అలాగే బిజెపి సీనియర్ నాయకుడు సుగుణాకర్ రావు సంతాపం తెలిపారు.

బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి తోపాటు బిజెపి నాయకులు కార్యకర్తలు, ఆయన నివాసానికి తరలివెళ్ళి భౌతిక కాయానికి నివాళులర్పించారు. హరికుమార్ గౌడ్ అకాల మరణం పట్ల బిజెపి జిల్లా పక్షాన తీవ్ర దిగ్భ్రాంతిని, సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నామని, వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నామని కృష్ణారెడ్డితెలిపారు.

సిన కానిస్టేబుల్ విశ్వతేజను సీఐ ఏ. నిరంజన్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు.