calender_icon.png 4 July, 2025 | 2:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేషన్ బియ్యం పక్కదారి పట్టిస్తే కఠిన చర్యలు తప్పవు

04-07-2025 12:00:00 AM

  1. అక్రమంగా నిల్వ ఉంచిన 60 క్వింటాళ్లు రేషన్ 

బియ్యం పట్టుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు

రాజన్న సిరిసిల్ల జూన్ 3 (విజయక్రాంతి)జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ఆదేశాల మేరకు ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లి గ్రామంలో బినవేని దేవయ్య s/o ఎల్లయ్య, age 70,అనే వ్యక్తి వి విధ ప్రాంతాల్లో తక్కువ ధరకు రేషన్ బియ్యం సేకరించి ఎక్కువ ధరకు అమ్మడానికి నిల్వ ఉంచడన్న సమాచారం మేరకు. జిల్లా టాస్క్ఫోర్స్ సిబ్బంది, ఎల్లారెడ్డిపేట పోలీసులు సంయుక్తంగా ఆకస్మిక దాడి చేసి 60 క్వింటాళ్లు స్వాధీనం చేసుకొని తదుపరి చర్యల నిమిత్తం దేవయ్యను అక్రమంగా నిల్వ ఉంచిన 60 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్లో అప్పజెప్పడం జరిగిందన్నారు.

ఈ సందర్భంగా టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంపేదలకు అందిస్తున్న రేషన్ బియ్యం అక్రమ రవాణా చేస్తూ పేద ప్రజలకు అందకుండా పక్కదారి పట్టిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు నిరంతరం నిఘా పెడుతూ స్పెషల్ డ్రైవ్ లు చేస్తూ విస్తృత స్థాయిలో దాడులు. టాస్క్ఫోర్స్ సిబ్బంది రాజేష్,తిరుపతి,శ్రీనివాస్ ,శివ పాల్గొన్నారు.