దీర్ఘకాలి పెట్టుబడులకు అవకాశం
ఒడిదుడుకుల మార్కెట్‌పై విశ్లేషకుల మాట
లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో స్టాక్ మార్కెట్ తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతూ ఇన్వెస్టర్లను బెంబేలెత్తిస్తున్నది. అయితే ఇలాంటి సందర్భాలే దీర్ఘకాలిక పెట్టుబడులకు అనువైన సమయాలని విశ్లేషకులు సూచిస్తున్నారు. ప్రస్తుత ఒడిదుడుకులను కోనుగోలు అవకాశంగా భావించాలని ఇన్వెస్టర్లకు బ్రోకరేజ్ సంస్థ ఐసీఐసీఐ డైరెక్ట్ సూచించింది. మార్కెట్ కుదుటపడిన తర్వాత లార్జ్‌క్యాప్స్ మంచి రాబడుల్ని ఇస్తాయని, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసులు, ఆటోమొబైల్, క్యాపిటల్ గూడ్స్, మెటల్ షేర్లు దీర్ఘకాలిక పెట్టుబడులకు అనువైనవని అంచనా వేసింది. వివిధ రంగాల్లో పెరిగే అవకాశం ఉన్న షేర్లను ఐసీఐసీఐ డైరెక్ట్ సిఫార్సుచేసింది.
పీఎస్‌యూ: హిందుస్థాన్ ఏరోనాటి క్స్, భారత్ ఎలక్ట్రానిక్స్, కొచ్చిన్ షిప్‌యార్డ్, గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా, కోల్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్, ఇంజనీర్స్ ఇండియా, కంటైనర్ కార్పొరేషన్.
బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసులు: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా , యాక్సిస్ బ్యాంక్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, ఐడీబీఐ, ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్, ఎల్ అండ్ టీ ఫైనాన్స్, సుందరం ఫైనాన్స్
క్యాపిటల్ గూడ్స్, పవర్: ఏబీబీ, ఎల్ అండ్ టీ, థర్మాక్స్, తెగా ఇండస్ట్రీస్, ఏసీఈ, కల్పతరు పవర్, కేఈసీ ఇంటర్నేషనల్,
ఆయిల్ అండ్ గ్యాస్, ఎనర్జీ: రిలయన్స్ ఇండస్ట్రీస్, ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్, హిందుస్థాన్ పెట్రోలియం, టాటా పవర్, జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ, మంగళూరు రిఫైనరీ పెట్రో, పెట్రోనెట్ ఎల్‌ఎన్‌జీ, ఆయిల్ ఇండి యా, పవర్‌గ్రిడ్, టాటా పవర్,
ఆటోమొబైల్: మహీంద్రా అండ్ మహీంద్రా, మారుతి, ఐషర్ మోటార్స్, ఎక్సైడ్ ఇండియా, బాష్, యూనో మిండా, గాబ్రియల్
ఐటీ, టెలికం: టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, టెక్ మహీంద్రా, విప్రో, టాటా కమ్యూనికేషన్, సోనాటా సాఫ్ట్‌వేర్, లేటెంట్,
వినియోగం, రిటైల్: టైటాన్, డీమార్ట్, ట్రెంట్, జొమాటో, ఐసీఐఎల్, వెల్‌స్పన్ లివింగ్, వీగార్డ్, హవెల్స్, అరవింద్ ప్యాషన్
ఫార్మా, కెమికల్స్: సన్‌ఫార్మా, సిప్లా, అజంతా ఫార్మా, డాక్టర్ రెడ్డీస్, గ్రాన్యూల్స్, ఎస్‌ఆర్‌ఎఫ్, సుందరం కెమికల్స్
రియల్ ఎస్టేట్: డీఎల్‌ఎఫ్, బ్రిగేడ్, ఒబ్రాయ్ రియల్టీ, అరవింద్ స్మార్ట్, ఫినిక్స్, గ్రీన్‌ల్యామ్
ఇన్‌ఫ్రా, మెటల్స్: అదానీ పోర్ట్స్, అంబూజా సిమెంట్, జేకే సిమెంట్, ఎన్‌సీసీ, పీఎన్‌సీ ఇన్‌ఫ్రా, టాటా స్టీల్, సెయిల్, నాల్కో, హెచ్‌ఈజీ, జిందాల్ స్టీల్ అండ్ పవర్
ఇతర రంగాలు: తాజ్ జీవీకే, ఆస్ట్రా మైక్రోవేవ్, సౌత్ ఇండియన్ బ్యాంక్, టిటాఘర్ రైల్‌సిస్టమ్, జీపీపీఎల్, డెల్హివరీ, ఇక్రాన్, జీఎంఆర్ ఇన్‌ఫ్రా, పీఐ ఇండస్ట్రీస్






