తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్‌ను కలిసిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు
కామారెడ్డి, ఏప్రిల్ 16 (విజయ క్రాంతి): తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ హైదరాబాద్లో మర్యాదపూర్వకంగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు గీ రెడ్డి మహేందర్ రెడ్డి కలిశారు. శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా రానున్న స్థానిక సంస్థ ఎన్నికల్లో అదేవిధంగా పార్టీ గ్రామస్థాయి నుండి బూత్ స్థాయి వరకు బలోపేతం చేయాలని చెప్పారు. పార్టీ పదవులు కూడా సీనియర్లకే ఇవ్వాలని కోరారు.
పార్టీకి కష్ట కాలంలో పనిచేసిన వారికి పార్టీ పదవులు నామినేట్స్ పోస్టులు ఇవ్వాలని నిన్న సీఎం రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ లు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజ్ తో సుదీర్ఘంగా చర్చించడం జరిగిందని తెలిపారు. ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కాంగ్రెస్ పార్టీకి అవసరం ,ఎవరిని కూడా వదిలిపెట్టుకుని ఉద్దేశంలో కాంగ్రెస్ పార్టీ లేదు అని పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు.
ఎందుకంటే పార్టీకి కార్యకర్తల ముఖ్యం కాబట్టి కష్టకాలంలో పనిచేసిన కార్యకర్తలు గుర్తించి వారికి న్యాయం చేస్తామని చెప్పారు. ముఖ్యంగా గ్రూప్ తగాదాలను పక్కనపెట్టి కాంగ్రెస్ జెండా కింద పనిచేసే కార్యకర్తలు ముఖ్యం అని చెప్పారు. మహేష్ కుమార్ గౌడ్ ని కలిసినట్లు రాజీవ్ గాంధీ పంచాయతీ రాజ్ సంఘటన్ కామారెడ్డి జిల్లా కన్వీనర్ గిరెడ్డి మహేందర్ రెడ్డి తెలిపారు.






