calender_icon.png 25 May, 2025 | 10:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలపై స్పందించిన ఉన్నతాధికారులు.!

24-05-2025 11:50:36 PM

జనరల్ ఆసుపత్రిని తనిఖీ చేసిన డిఎంఈ..

రోగులకు మెరుగైన వైద్యం అందించాలని సూచన..

నాగర్ కర్నూల్ (విజయక్రాంతి): నాగర్ కర్నూల్ జనరల్ ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ్య అధికారులు స్పందించారు. శనివారం జనరల్ ఆసుపత్రితో పాటు మెడికల్ కళాశాలలో రాష్ట్ర డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(State Director of Medical Education) డీఎంఈ  డాక్టర్ కే శివరాం ప్రసాద్ సందర్శించారు. ఈ సందర్భంగా జనరల్ ఆసుపత్రిలోని ఆయా అవార్డులను మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ రమాదేవి, ఆసుపత్రి సూపర్ఇంటెండెంట్ రచ్చ రఘుతో పాటు సందర్శించారు. ఆస్పత్రిలో నెలకొన్న సమస్యలపై అక్కడి అధికారులను అడిగి తెలుసుకున్నారు. 

పారిశుద్ధ్య లోపం, అవినీతి, అక్రమాలు, అలసత్వం వంటి వాటిపై విజయక్రాంతి వరుసగా కథనాలను ప్రచురించగా జిల్లా ఉన్నతాధికారులు సైతం నిర్లక్ష్యం వహించారు. అదే విషయాలపై మరోసారి విజయక్రాంతి వార్త కథనాలను ప్రచురించడంతో ఎట్టకేలకు రాష్ట్ర ఉన్నతాధికారులు స్పందించారు. పరిష్కారానికి వీలయ్యే సమస్యలను కూడా అధికారులు పట్టించుకోకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతూ ఆ వార్డులోని వైద్యులతో తరచూ గొడవలకు దిగుతున్న పరిస్థితి. ఆ ఒత్తిడిని తట్టుకోలేక కొంతమంది వైద్యులు రాజీనామా కూడా చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.  నేపథ్యంలో ఆయా విభాగాల వైద్యులతో రహస్యంగా పలు అంశాలపై విచారణ జరిపారు.

ఆస్పత్రిలో నెలకొన్న మందుల కొరతపై స్పందిస్తూ ఎలాంటి కొరత లేదంటూ కృత్రిమ కొరత సృష్టించే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం మెడికల్ కళాశాల భవనం నూతనంగా నిర్మించిన భవనాలు విద్యార్థుల హాస్టల్ భవనాలను పరిశీలించారు. జనరల్ ఆస్పత్రిలో ఆపరేషన్ థియేటర్ల కొరత ఉన్నదని గుర్తించమని వాటిని పరిష్కరించేందుకు త్వరలోనే అన్ని చర్యలు చేపడుతున్నామన్నారు. నూతన మెడికల్ కళాశాల భవనం ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. త్వరలోనే అన్ని సమస్యలు పరిష్కరించబడతాయని పేర్కొన్నారు.