calender_icon.png 25 May, 2025 | 3:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఆరోపణలు అవాస్తవం

24-05-2025 11:47:53 PM

జడ్చర్ల -కోదాడ జాతీయ రహదారి పరిహారం తప్పుడు ప్రకటనలు చేస్తే ఎలా.. 

ఎమ్మెల్యే తప్పుడు ప్రచారం చేస్తున్నారని జడ్చర్ల టిఆర్ఎస్ నేతలు లేఖ విడుదల..

మహబూబ్ నగర్ (విజయక్రాంతి): జడ్చర్ల నుండి కోదాడ వరకు 220 కిలోమీటర్ల మేర నిర్మాణం జరిగిన 167 జాతీయ రహదారి జడ్చర్లతో పాటు అనేక పట్టణాల మీదుగా వెళ్లిందని జడ్చర్ల బీఆర్ఎస్ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకటనలో జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి(MLA Anirudh Reddy) జడ్చర్ల నుంచి కోదాడ వరకు నిర్మించిన రోడ్డు విషయంలో పరిహారంపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని వారు కొన్ని విషయాలను తెలియజేశారు. కల్వకుర్తి, దేవరకొండ, హాలియా పట్టణాల మీదుగా వెళ్లిన నేషనల్ హైవేలో అనేక మంది ఇండ్లు, భూములు కోల్పోయారని, జాతీయ రహదారి నిబంధనల ప్రకారం జడ్చర్ల పట్టణంతో పాటు మిగతాచోట్ల కూడా ఎక్కడా బాధితులకు పరిహారం ఇవ్వలేదన్నారు.

రోడ్డు మధ్య నుండి యాబై ఫీట్ ల తరువాత ఇండ్లు కోల్పోయిన వారికి మాత్రమే ఎన్ హెచ్ ఏ ఐ పరిహారం అందించే రూల్ ఉందన్నారు. జడ్చర్ల నుండి కర్ణాటకలోని చించొలి నేషనల్ హైవే కి కూడా ఇదే తరహా నిబంధనలు ఉన్నాయని గుర్తు చేశారు. జడ్చర్ల లో కూడా ఇవే నిబంధనలు వర్తించాయని స్పష్టం చేశారు. పరిహారం విషయం లో జడ్చర్ల పట్టణ ప్రజలకు ఎటువంటి అన్యాయం జరగలేదని, జాతీయ రహదారుల సంస్థ నిబంధనల ప్రకారమే బాధితులకు పరిహారం అందుతుందనే విషయం ఎమ్మెల్యే  గ్రహించాలన్నారు. జడ్చర్ల నియోజకవర్గం ఎంత మేలు చేస్తే అంత బాగుంటుందని బిఆర్ఎస్ ఉంటుందని, ఈ విషయాలన్నీ జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

ఇష్టం సారంగా మాట్లాడి ప్రజలను తప్పుదోవ పట్టించకూడదని, ఇప్పుడు జరుగుతున్న భూత్పూర్ చించోలి రోడ్డు విషయంలో కూడా ఒకసారి గమనించాలని తెలిపారు. ప్రతి విషయాన్ని తెలుసుకొని ప్రజలకు వివరించాలని ఏదో ఒకటి మాట్లాడి ప్రజలను నమ్మించాలని చూస్తే సరి అయిన విషయాలు వారికి తెలుసుకొని ఎమ్మెల్యే గా ఉండి చెప్పిన విషయాలు తప్పుగా ఉన్నాయని జడ్చర్ల ఎమ్మెల్యేనే ఇలా మాట్లాడడమేంటని  అనుకుంటారని హితవు పలికారు.  ప్రజలకు పరిహారం అందించడంలో గత ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండి ముందుకు సాగిందని జడ్చర్ల బిఆర్ఎస్ పార్టీ స్పష్టం చేసింది.