24-05-2025 11:52:58 PM
జాబ్ మేళాలో కుటుంబ పెద్ద పాత్ర పోషించిన ఎమ్మెల్యే..
కడుపు నింపిన.. నిరుద్యోగుల కళ్ళల్లో ఆనందం..!
ఆ ఎనిమిది గంటలు వేదికపైనే..
జాబ్ మేళా సక్సెస్ లో.. ఎమ్మెల్యే దే క్రియాశీలక పాత్ర..
వైరా (విజయక్రాంతి): ఆయన ఒక నియోజకవర్గానికి ప్రధమ పౌరుడు... ఎటువంటి మెగా కార్యక్రమాలకైనా.. అలా వచ్చి.. అలా వెళ్ళిపోయే వెసులుబాటు గల వ్యక్తి... కానీ.. అందుకు భిన్నంగా.. గంపడంత ఆశలతో వచ్చిన వారిలో వెలుగు రేకలు కల్లారా చూస్తూ.. ఆ వేదికపైనే విసుగక.. అలసట లేకుండా.. దాదాపు 8 గంటలు కంపెనీల ప్రతినిధులతో తమ దగ్గరకు వచ్చిన నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తూ... భోజనం సైతం మరచి ఎంతో చిత్తశుద్ధితో వ్యవహరించారు వైరా ఎమ్మెల్యే మాలోతు రాందాస్ నాయక్(MLA Maloth Ramdas Nayak). ఆయన నిబద్ధతపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.. వైరాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మెగా జాబ్ మేళా కార్యక్రమాన్ని శనివారం ఎమ్మెల్యే ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ జాబ్ మేళాకు 90 కంపెనీలకు చెందిన వారు పాల్గొనగా, జాబ్ మేళాకు వేలాదిమంది నిరుద్యోగులు హాజరయ్యారు.. విద్యార్హతల ఆధా ఎటువంటి అంతరాయం జరగకుండా అసౌకర్యానికి తావివ్వకుండా జాబ్ మేళా సక్సెస్ పై .. నియోజకవర్గంలో చర్చ జరుగుతుంది.