calender_icon.png 6 May, 2025 | 10:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లిటిల్ ఫ్లవర్స్ విద్యాసంస్థలలో సంచలన ఫలితాలు..

22-04-2025 07:53:41 PM

ఇంటర్మీడియట్ ఫలితాలలో చరిత్ర సృష్టించిన లిటిల్ ఫ్లవర్స్ విద్యార్థులు...

భద్రాచలం (విజయక్రాంతి): భద్రాచలం పట్టణంలోని లిటిల్ ఫ్లవర్స్ విద్యా సంస్థ(Little Flower Educational Institute)లలో సంచలన ఫలితాలు నమోదయ్యాయి. ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలలో లిటిల్ ఫ్లవర్స్ విద్యార్థినీ విద్యార్థులు చరిత్ర సృష్టించి ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కనివిని ఎరుగని మార్కులను సాధించారు. మంగళవారం ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించిన పరీక్ష ఫలితాలలో ఎంపీసీ విభాగంలో ఎండి తబస్సుమ్ 993/1000 జి జ్యోత్న ప్రియ, 993/1000 కొవ్వూరి జాహ్నవి, ప్రియ 991/1000 మార్కులు సాధించి చరిత్ర సృష్టించగా బి మోక్షిత 990/1000 అదేవిధంగా బైపీసీ విభాగంలో బి గ్లోరీ 992 /1000 మార్కులతో సంచలనాలను సృష్టించారు. 

మొదటి సంవత్సరం ఫలితాలలో సైతం లిటిల్ ఫ్లవర్స్ విద్యార్థులైన భువన్ శ్రీ 468/470 ఎంపీసీ విభాగంలో రాష్ట్రస్థాయి ర్యాంకును కైవసం చేసుకోగా బైపీసీ విద్యార్థిని అయిన బిట్ల హాసిని 438/440 మార్కులతో రాష్ట్రస్థాయి మొదటి ర్యాంకును కైవసం చేసుకున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కనివిని ఎరగని స్థాయిలో మార్కులు సాధించిన లిటిల్ ఫ్లవర్స్ విద్యా సంస్థలను పలువురు విద్యావేత్తలు మేధావులు అభినందిస్తున్నారు.

ఉత్తమ విద్యా బోధన వ్యక్తిగత శ్రద్ధతోనే మంచి ఫలితాలు సాధ్యం...

విద్యాసంస్థల డైరెక్టర్లు మాగంటి ప్రసాద్ బాబు రమేష్ బాబు...

అనుభవం కలిగిన ఉత్తమ ఉపాధ్యాయులతో విద్యాబోధనను అందించడమే కాకుండా ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ధ చూపడం వల్లనే రాష్ట్రంలోనే అత్యుత్తమ ఫలితాలను లిటిల్ ఫ్లవర్స్ విద్యాసంస్థల విద్యార్థులు సాధించగలిగారని ఆ సంస్థల డైరెక్టర్లు అయిన మాగంటి శ్రీనివాస వరప్రసాద్, మాగంటి రమేష్ బాబు లు తెలిపారు. ఉత్తమ ఫలితాలను సాధించిన సందర్భంగా కళాశాల ఆవరణలో నిర్వహించిన అభినందన సభలో వారు మాట్లాడుతూ... గత నలభై ఏళ్ల నుండి ఏజెన్సీ ప్రాంతమైన భద్రాచలంలో కార్పొరేట్ స్థాయి విద్యను అందించాలన్న లక్ష్యంతో సాధారణ ఫీజులతో అత్యుత్తమ విద్యను అందించగలుగుతున్నామని అన్నారు.

మారుతున్న టెక్నాలజీని అందిపుచ్చుకుంటూనే శాస్త్రీయమైన పద్ధతిలో ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధను చూపుతూ వారిలోని పరీక్ష భయాన్ని పోగొట్టేందుకు ప్రణాళిక బద్ధంగా రోజువారి పరీక్ష విధానాన్ని అవలంబిస్తూ వెనక పడుతున్న విద్యార్థులపై ప్రత్యేక దృష్టిని సారిస్తూ వారికి అర్థమయ్యే రీతిలో విద్య బోధనను అందించడమే లిటిల్ ఫ్లవర్ విద్యా సంస్థల యొక్క ప్రత్యేకత అని వారు స్పష్టం చేశారు. విశాలమైన తరగతి గదులు ఆహ్లద కరమైన వాతావరణంలో ప్రత్యేక స్టడీ అవర్స్ నిర్వహిస్తూ విద్యార్థులకు వచ్చే సందేహాలను ఎప్పటికప్పుడు నివృతి చేస్తూ విద్యాబోధన అందించడం వల్లనే ప్రతి సంవత్సరం ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని లిటిల్ ఫ్లవర్స్ విద్యార్థులు అగ్రస్థానంలో నిలుస్తున్నారని అన్నారు.

ఈ ఫలితాలతో తమపై బాధ్యత మరింత పెరిగిందని భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించేందుకు ఉపాధ్యాయులు సిబ్బంది విద్యార్థుల తల్లిదండ్రులు తో కలిసి సమిష్టిగా కృషి చేస్తామని ఈ సందర్భంగా ప్రసాద్ బాబు రమేష్ బాబులు హామీ ఇచ్చారు. అనంతరం ర్యాంకులు సాధించిన విద్యార్థిని విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులను శాలువాలతో సత్కరించి జ్ఞాపికలను అందించారు. అదేవిధంగా ఇంతటి విజయానికి కృషిచేసిన కళాశాల అధ్యాపక బృందాన్ని శాలువాలతో సత్కరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు బషీరుద్దీన్, ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు, తదితరులు పాల్గొన్నారు.