06-05-2025 12:35:06 AM
పాక్ వైమానిక దాడులు చేస్తే..?!
న్యూఢిల్లీ, మే 5: భారత్ మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతు న్న నేపథ్యంలో రాష్ట్రాలకు కేంద్రం కీలకసూచనలు చేసింది. ఒక వేళ పాకిస్థాన్ వైమానిక దాడులకు దిగితే తమను తాము ఎలా కాపాడుకోవాలో పౌరులు, విద్యార్థులకు ట్రైనింగ్ ఇవ్వాలని, దేశభద్రతలో పౌరులను సమాయత్తం చేసేందుకు మే 7వ తేదీన మాక్ డ్రిల్స్ నిర్వహించాలని సోమవారం కేంద్ర హోం శాఖ రాష్ట్రాలకు సూచించింది.
డ్రిల్స్ సమయంలో హెచ్చరిక సైరెన్లు మోగనున్నాయి. యుద్ధ సమయంలో ఎలా స్పందించాలో పౌరులను సమాయత్తం చేయాలని హోం శాఖ భావిస్తోంది. వైమానిక దళ హెచ్చరిక సైరెన్ల పనితీరును కూడా పరీక్షించాలనిఆదేశించింది. పాక్‌తో ఉద్రిక్తతల నేపథ్యంలో ఇప్పటికే ప్రధానమంత్రి భద్రతాదళాలకు పూర్తి స్వేచ్ఛనిచ్చారు.
మోదీతో భేటీ రక్షణశాఖ కార్యదర్శి
ప్రధాన మంత్రి మోదీ సోమవారం రక్షణ శాఖ కార్యదర్శి రాజేశ్ కుమార్ సింగ్‌తో భేటీ అయ్యారు. ఢిల్లీలోని ప్రధాని నివాసంలో వీరి భేటీ జరిగింది. ఆదివారం ప్రధాని వైమానిక దళ చీఫ్ అమర్‌ప్రీత్ సింగ్‌తో భేటీ అయ్యారు. అంతకు ముందు నౌకాదళ చీఫ్ అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠితో కూడా ప్రధాని చర్చలు జరిపారు. దేశ సరిహద్దుల్లో భద్రత, తాజా పరిణామాల గురించి రాజేశ్ కుమార్ సింగ్ ప్రధానికి వివరించినట్టు తెలుస్తోంది.
సైబర్‌దాడులకు దిగిన పాకిస్థాన్
భారత రక్షణ శాఖకు చెందిన పలు వెబ్‌సైట్లపై పాక్ హ్యాకర్లు దాడులకు తెగబడ్డారు. మిలటరీ ఇంజినీర్ సర్వీసెస్, మనోహర్ పారికర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిఫెన్స్ అండ్ అనాలసిస్ సంస్థలకు చెందిన వెబ్‌సైట్లపై దాడులు చేసి లాగిన్ వివరాలు, రక్షణశాఖ సమాచారం వంటి సున్నితమైన డేటాను దొంగిలించారు.
ఈ విషయాన్ని పాకిస్థాన్ సైబర్‌ఫోర్స్ ఎక్స్‌లో తెలిపింది. మనోహర్ పారికర్ డిఫెన్స్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన 1600 మంది డే టాను దొంగిలించినట్టు సైబర్ ఫోర్స్ పేర్కొంది. ఆర్మ్‌డ్ వెహికిల్ నిగమ్ లిమిటెడ్ అనే వెబ్‌సైట్‌ను కూడా హ్యాక్ చేసేందుకు ప్రయత్నించింది. వెం టనే ఈ ప్రభుత్వ సంస్థ ఆన్‌లైన్ వ్యవస్థను ఆపేసింది.
సైబర్ నిపుణు లు ఈ దాడులపై అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయని విశ్వసనీయ వర్గా లు తెలిపాయి. పాకిస్థాన్ సైబర్ ఫోర్స్ ఆరోపించిన విధంగా తమ సంస్థపై ఎ టువంటి సైబర్ దాడి జరగలేదని మనోహర్ పారికర్ డిఫెన్స్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన సీనియర్ సభ్యుడు సోమవారం ప్రకటించారు. ఈ సంస్థపై కూడా పాకిస్థాన్ సైబర్ ఫోర్స్ సైబర్ దాడులు చేశామని ప్రకటించుకుంది.