calender_icon.png 21 July, 2025 | 4:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోస్టాఫీసుల్లో సేవలు మరింత సులభతరం

21-07-2025 01:35:27 AM

22 నుంచి కొత్త టెక్నాలజీ ఏపీటీ అమలు 

మహబూబాబాద్ , జూలై ౨౦ (విజయ క్రాంతి): భారతీయ తపాలా శాఖ దేశవ్యాప్తంగా తన సేవలను మరింత ఆధునికీకరించేందుకు, డిజిటల్ రంగం వైపు అడుగులు వేస్తూ ‘అడ్వానస్డ్ పోస్టల్ టెక్నాలజీ’(ఏ పి టి) అనే కొత్త సాఫ్ట్వేర్ అప్లికేషన్ను అమలు చేస్తోంది. ఈ సాఫ్ట్వేర్ను జూలై 22 నుంచి దేశవ్యాప్తంగా అన్ని పోస్టాఫీసుల్లో అమలు చేయనున్నారు.

ఈ కొత్త డిజిటల్ వ్యవస్థ ద్వారా తపాలా సేవలు మరింత వేగవంతం, కచ్చితంగా మారనున్నాయి. డిజిటల్ ఇండియా కార్యక్రమంలో భాగంగా, దేశ నిర్మాణంలో ఇది ఒక ముఖ్యమైన అడుగుగా పోస్టల్ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. కొత్త సాఫ్ట్వేర్ అమలు కోసం శనివారం నుండి సోమవారం వరకు అన్ని విధాల పోస్టల్ ఆద్విక సేవలు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు పోస్టల్ అధికారులు తెలిపారు. 

ఏపీటీ అంటే ఏమిటి?

అడ్వానస్డ్ పోస్టల్ టెక్నాలజీ (ఏ పీ టి) అప్లికేషన్ అనేది క్లౌడ్ సర్వర్ ఆధారిత డిజిటల్ వేదిక. ఇది పోస్టల్ సేవలను సులభతరం చేయడానికి, ఆధునీకరించడానికి రూపొందించబడింది. ఈ యాప్ను ఐఐటీ హైదరాబాద్, ఇస్రో (ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్) సహకారంతో భారత తపాలా శాఖ అభివృద్ధి చేసింది. ఈ సాఫ్ట్వేర్ ద్వారా సాంప్రదాయ పోస్టల్ సేవలను డిజిటల్ రూపంలోకి మార్చడం, ఖచ్చితమైన చిరునామా వ్యవస్థను అందించడం, సేవల డెలివరీలో ఆలస్యాలను తగ్గించడం లక్ష్యంగా ఉంది.

డిజిపిన్

ఈ యాప్లోని ప్రధాన ఆకర్షణ డిజిపిన్, ఇది ప్రతి వ్యక్తికి ఖచ్చితమైన డిజిటల్ చిరునామాను అందిస్తుంది. ఇది మొబైల్ స్థానం ఆధారంగా జనరేట్ అవుతుంది. ఇప్పటికే అమలులో ఉన్న సాంప్రదాయ 6-అంకెల పిన్ కోడ్ వ్యవస్థను ఇది మరింత ఖచ్చితంగా మారుస్తుంది. జిల్లా, మండలం,  గ్రామం వారీగా వివరాలను డిజిటల్ మ్యాప్తో అనుసంధానిస్తుంది.

 స్నేహపూర్వక సేవలు

ఏపిటి యాప్ ద్వారా వినియోగదారులు తమ ప్రాంతానికి సంబంధించిన ఖచ్చితమైన పిన్ కోడ్ను తెలుసుకోవచ్చు. అదనంగా, వినియోగదారులు ఫీడ్బ్యాక్ ఇవ్వడం ద్వారా సేవలను మెరుగుపరచడంలో సహాయపడవచ్చు.

వేగవంతమైన సురక్షిత సేవలు

ఈ కొత్త సాఫ్ట్వేర్ వ్యవస్థ ద్వారా పోస్టల్ వ్యవహారాలు మరింత వేగవంతంగా, ఖచ్చితంగా, సురక్షితంగా ఉంటాయి. చిరునామా తప్పుల వల్ల సంభవించే ఆలస్యాలు తగ్గిపోతాయి. తమ ప్రాంతానికి సంబంధించిన ఖచ్చితమైన పిన్ కోడ్ తెలుసుకోవచ్చు. అదనంగా వినియోగదారుల ఫీడ్ బ్యాక్ ఇవ్వడం ద్వారా సేవలను మరింత మెరుగుపరుచుకోవచ్చు.

డిజిటల్ ఇండియాతో అనుసంధానం

 ఏపీటీ యాప్ డిజిటల్ ఇండియా లక్ష్యాలతో సమన్వయం కలిగి ఉంటుంది. ప్రతి పౌరుడిని డిజిటల్గా అనుసంధానించడం ద్వారా సేవలను మరింత అందుబాటులోకి తీసుకువస్తుంది. అమలు వివరాలు ఈ కొత్త సాఫ్ట్వేర్ను అమలు చేసేందుకు జూలై 21 న ఒక రోజు పాటు పోస్టాఫీసుల్లో తాత్కాలికంగా సేవలను నిలిపివేస్తారు.

ఆ రోజు ‘నియోజిత డౌన్టైమ్’గా పరిగణించబడుతుంది. ఈ సమయంలో సాంకేతిక అప్గ్రేడ్లు జరుగుతాయి. అనంతరం జూలై 22 నుంచి అన్ని పోస్టాఫీసుల్లో ఏ పి టి అప్లికేషన్ పూర్తి స్థాయిలో అమలులోకి వస్తుంది. 

సులభమైన యాక్సెస్

 వినియోగదారులు తమ మొబైల్ ద్వారా డిజిటల్ చిరునామాను సులభంగా పొందవచ్చు. ఫీడ్బ్యాక్ సౌకర్యం ద్వారా సేవలను మెరుగుపరచడానికి అవకాశం ఏర్పడనుంది. 

సురక్షిత వ్యవహారాలు

క్లౌడ్ ఆధారిత వ్యవస్థ ద్వారా డేటా భద్రత, వ్యవహారాల సురక్షితత్వంగా నిలుస్తుందని పోస్టల్ అధికారులు పేర్కొంటు న్నారు. ఏ పి టి అమలుతో భారత తపాలా శాఖ డిజిటల్ యుగంలోకి బలమైన అడుగు వేస్తుందని, గతంలో నాలుగు రకాల సాఫ్ట్వేర్లను వినియోగిస్తుండగా,

ఈ కొత్త సాఫ్ట్వేర్ ద్వారా సేవలన్నీ ఏకీకృతమై మరింత వేగవంతం, ఖచ్చితం, సురక్షితంగా మారడంతో పాటు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని పౌరులు ఒకే విధమైన డిజిటల్ సేవలను పొందనున్నారు. ఈ విధానం అమలు వల్ల డిజిటల్ ఇండియా లక్ష్యాలను సాకారం చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని భావిస్తున్నారు.