calender_icon.png 21 July, 2025 | 7:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అడ్డంకులను అధిగమించి గ్లోబల్ లీడర్‌గా ఎదగాలి

21-07-2025 01:51:03 AM

- ఏఐ, ఆర్‌అండ్‌డీ, బిగ్ టెక్‌కు ప్రాధాన్యమివ్వాలి

- కొత్త ప్రపంచ క్రమాన్ని మనమే రూపొందించాలి

- బీజేపీ నేత, రచయిత రామ్‌మాధవ్

హైదరాబాద్, జూలై 20 (విజయక్రాంతి): దేశీయ సవాళ్లు, అడ్డంకులను అధిగమించి ప్ర పంచస్థాయికి ఎదగడంపై దృష్టి సారించాల్సిన సమయం ఆసన్నమైందని బీజేపీ నేత రామ్‌మాధవ్ అన్నారు. హైదరాబాద్ తాజ్ కృష్ణా లో ఆదివారం ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమం లో ‘ది న్యూ వరల్డ్ ఫస్ట్ సెంచరీ గ్లోబ ల్ ఆర్డర్ అండ్ ఇండియా’ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు.

మన దేశ విదేశాంగ విధానంలో ఆదర్శవాద రొ మాంటిసిజం నుంచి వాస్తవిక ప్రాగ్మాటిజం వైపు వ్యూహాత్మక మార్పు రావాలని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రతి దేశానికి అంతర్గత స వాళ్లు ఉంటాయని, అమెరికా, చైనా కూడా ఈ సవాళ్లను ఎదుర్కునే ప్రపంచ స్థాయికి ఎదిగాయన్నారు. భారత్ కూడా అదే విధంగా ముం దుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు.

ప్ర పంచం ఏం చేస్తుందో దాన్ని అనుసరించడం మానేసి నాయకత్వం వహించేందుకు సిద్ధపడాలన్నారు. భద్రతా మండలి, ప్రపంచ వాణి జ్య సంస్థలు 1945 తర్వాత ఎలా క్షీణించా యో వివరించారు. రష్యా యుద్ధం సవాళ్లను ఎదుర్కునడంలో ఇలాంటి వేదికలు దారుణం గా వైఫల్యం చెందాయన్నారు. 

 ప్రపంచానికి సవాలుగా ఏఐ 

ఏఐ వేగంగా విస్తరిస్తోందని, నేటి ప్రపంచానికి ఇది సవాలుగా మారిందని ఆయన అన్నా రు. పరిశోధన కోసం మన దేశం జీడీపీలో కేవలం 1శాతం ఖర్చు చేస్తుంటే.. చైనా 6.5శా తం, అమెరికా 4శాతం ఖర్చు చేస్తున్నాయని ఆయన తెలిపారు. మన దేశం 10 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మారాలంటే వ్యూహాత్మక మార్పు అవసరమని స్పష్టం చేశారు.

ఏఐ, బిగ్ టెక్, ఆర్‌అండ్‌డీకి అధిక ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. కార్యక్రమానికి రష్యాలో మన దేశ మాజీ రాయబారి వెంకటేష్ వర్మ, నల్సార్ వైస్ ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ కృష్ణదేవరావు, సీనియర్ జర్నలిస్టు ఉమా సుధీర్ అతిథులుగా హాజరయ్యారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్ రావు, సహా పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.