5 May, 2026 | 9:00 AM

ఇద్దరు పోకిరీలకు ఏడు రోజుల జైలు

10-12-2024 01:46 AM

*విద్యార్థినులను వేధించిన కేసులో శిక్ష

నాగర్‌కర్నూల్, డిసెంబర్ 9 (విజయక్రాంతి): బాలికలను పాఠశాల వద్ద వేధించిన ఇద్దరు పోకిరీలకు 7 రోజుల జైలు శిక్షతో పాటు రూ.2వేల జరిమానా విధిస్తూ స్పెషల్ జ్యుడీషియల్  సెకండ్ క్లాస్ న్యాయమూర్తి సోమవారం తీర్పు వెలువరించినట్లు ఏఎస్పీ రామేశ్వర్ తెలిపారు. బిజినపల్లి మండలంలోని ఓ ప్రభుత్వ పాఠ శాలకు వెళ్లే విద్యార్థులను సెంట్రింగ్ పనిచేసుకునే ఇద్దరు యువకులు తరచూ వేధించేవారు. ఈక్రమంలో రెండు రోజుల క్రితం విద్యార్థినులు ఫిర్యాదు చేయడంతో షిటీం ఇంచార్జి విజయలక్ష్మి, వెంకటయ్య వారిపై కేసు నమోదు చేశారు. సాక్ష్యాల పరిశీలన అనంతరం న్యాయమూర్తి తీర్పు వెలువరించినట్లు ఏఎస్పీ వెల్లడించారు.