బండరాయితో మోది చంపేసింది
10-12-2024 01:45 AM
మద్యానికి బానిసైన భర్తను కడతేర్చిన భార్య
వికారాబాద్, డిసెంబర్ 9 (విజయక్రాంతి): మద్యం తాగి వేధిస్తున్న భర్త తలపై రాయితో మోది హత్య చేసిందో ఇళ్లాలు. యాలాల్ ఎస్‌ఐ గిరి తెలిపిన వివరాలు.. తాండూరు మున్సిపల్ పరిధిలోని ఇందిరమ్మ కాలనీకి చెందిన ఖాజామియా(30), భార్య అర్షాబేగం దంపతులు.ఖాజామియా మద్యానికి బానిసై రోజూ భార్యను వేధించేవాడు.
సోమవారం కూడా ఖాజామియా మద్యం సేవించి భార్యతో గొడవ పడ్డాడు. భర్త వేధింపులతో విసుగెత్తిన అర్షా బేగం బండరాయితో అతడి తలపై తీవ్రంగా కొట్టింది. ఈ దాడిలో అతడు అక్కడిక్కడే చనిపోయాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని యాలాల్ ఎస్‌ఐ గిరి తెలిపారు.






