పనులకు డెడ్‌లైన్ పెట్టండి
* పూర్తి చేయకపోతే అధికారులపై చర్యలు: మంత్రి శ్రీధర్ బాబు
* కాళేశ్వరంలో పలు శంకుస్థాపనలు, ఆలయంలో మ్యూజియంకు శంకుస్థాపన
కాళేశ్వరం, మార్చి 13 (విజయక్రాంతి): పూర్తి చేయాల్సిన అభివృద్ధి పనులకు ఖచ్చితమైన డెడ్లైన్లు నిర్ణయించి, ఆ గడువులోపు పనులు పూర్తి చేయని అధికారులపై షోకాజ్ నోటీసులు జారీ చేసి శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అధికారులను ఆదేశించారు. శుక్రవారం మహాదేవపూర్ మండలంలోని కాళేశ్వరం ప్రాంతంలో పలు అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు.
కాళేశ్వరం నుండి పలుగుల వరకు రూ.22 కోట్ల వ్య యంతో నిర్మించబోయే 7 కిలోమీటర్ల డబుల్ బీటీ రోడ్డు పనులకు, కాళేశ్వరంలో రూ. 1.20 కోట్లతో నిర్మించనున్న మ్యూజియం పనులకు, ఆది ముక్తేశ్వర దేవస్థానం నుండి సరస్వతి ఘాట్ వరకు రూ.2.38 కోట్ల వ్య యంతో బీటీ రోడ్డు నిర్మాణానికి మంత్రి శం కుస్థాపన చేశారు. అదేవిధంగా రూ.1 కోటి 55 లక్షలతో నిర్మించిన అన్నదాన సత్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కాళేశ్వరం, అన్నారం గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను మంత్రి అందజేశారు. అనంతరం కాళేశ్వరం ఈఓ కార్యాలయంలో సరస్వతి అంత్య పుష్కరాలు మరియు రాబోయే గోదావరి పుష్క రాల సందర్భంగా చేపట్టాల్సిన ఏర్పాట్లపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ముఖ్యమైన సమావే శానికి ఎస్‌ఈ స్థాయి అధికారులు హాజరు కాకపోవడంపై మంత్రి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మాకేం పని లేదనుకుంటున్నారా..? పుష్కరాల కంటే ముఖ్యమైన పనులు ఏమి ఉన్నాయి..? అంటూ అధికారులను ప్రశ్నించారు.పుష్కరాల నిర్వహణకు సంబంధించిన పనులను శాఖల మధ్య సమన్వయంతో మే మొదటి వారంలోపు వేగం గా పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన మౌలిక వసతులు, రోడ్లు, పారిశుధ్యం, భద్రత వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.ఈ సందర్భం గా బస్టాండ్ నిర్మాణానికి చెరువు స్థలం కేటాయించాలని సీసీఎల్‌ఏతో మంత్రి ఫోన్లో మాట్లాడారు.
చెరువు పూర్తిగా ఎండిపోయి ఉండటంతో పాటు పంటలు కూడా సాగు చేయడం లేదని, కాబట్టి బస్ స్టాండ్ నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని సూచించారు. బస్ స్టాండ్ స్థలం గెజిట్లో లేదని చెబుతూ ఆటంకాలు కలిగిస్తున్న అటవీ శాఖ అధికారులను మంత్రి ప్రశ్నించారు. బస్ స్టాండ్ లేకపోవడం వల్ల భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, చెరువు సర్వే చేయాలని సూచించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ, నిర్ణయించిన గడువులోపు శాఖల అధికారులు వారికి కేటాయించిన పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో ధార్మిక సంస్థల సలహాదారుడు గోవింద హరి, ఎస్పీ సంకీర్త్, అటవీ శాఖ అధికారి నవీన్ రెడ్డి, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, దేవాదాయ, ఇరిగేషన్, విద్యుత్తు, పీఆర్, మిషన్ భగీరథ తదితర శాఖల జిల్లా గ్రంథాలయం చేర్మెన్ కోట రాజబాపు,కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మాడుగుల పవన్ శర్మ, యూత్ అధ్యక్షులు నగేష్ యాదవ్, జిల్లా బ్లాక్ కాంగ్రెస్ కార్యదర్శి మెంగాని అశోక్,జిల్లా ప్రధాన కార్యద ర్శి కామిడి శ్రీనివాస్,చల్లా తిరుపతి, ఎస్సి సెల్ అధ్యక్షులు రాజబాబు,అధికారులు పాల్గొన్నారు.
మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
కాళేశ్వరం, మార్చి 13 (విజయక్రాంతి): మహిళల ఆర్థికాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. శుక్రవారం మహాదేవపూర్ గిరిజ న సంక్షేమ భవన్లో నిర్వహించిన కుట్టు మి షన్ల శిక్షణా కార్యక్రమం, స్వయం సహాయక సంఘాల మహిళలకు బ్యాంకు లింకేజీ పం పిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కుట్టు శిక్షణ కేంద్రాలను ప్రా రంభిస్తోందని తెలిపారు. మహిళా సంఘాల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం పలు కార్యక్రమాలు చేపడుతోందన్నారు.ఈ కార్యక్రమం లో వ్యవసాయ శాఖ, ఉద్యాన శాఖల ద్వారా రైతులకు రాయితీపై వ్యవసాయ పరికరాలు, ఉద్యాన యాంత్రీకరణ పరికరాలను కూడా అందజేశారు. మహిళలు శిక్షణ పొందడంతో పాటు ఉత్పాదక రంగంలో కూడా ముం దుకు రావాలని మంత్రి సూచించారు. త్వరలోనే కాటారం, మంథని ప్రాంతాల్లో చిన్న గార్మెంట్స్ ఫ్యాక్టరీలకు శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు.
మహాదేవపూర్ ప్రాంతంలో అగరువత్తుల తయారీకి సంబంధించిన పెద్ద కంపెనీ ద్వారా మహిళలకు శిక్షణ కార్యక్రమాలు ప్రారంభించనున్నట్లు వెల్లడించా రు. శిక్షణ పొందిన మహిళలు నాణ్యమైన ఉత్పత్తులు తయారు చేసినప్పుడే మంచి మా ర్కెట్ లభిస్తుందని, తద్వారా లాభాలు పొం దవచ్చని మంత్రి అన్నారు. రాజీవ్ యువశక్తి ద్వారా డైరీ ఉత్పత్తులపై కూడా శిక్షణ ఇవ్వాలని సూచించారు. సమగ్ర వ్యవస్థ ద్వారా మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసి కోటీశ్వరులుగా తీర్చిదిద్దడం ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు..మహిళా శక్తి క్యాంటీన్లు సక్రమంగా నిర్వహించకపోవడంపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరలో మహిళలకు పెట్రోల్ బంకులు ఏర్పాటు చేసి, వాటి నిర్వహణకు అవసరమైన శిక్షణ కూడా అందజే యనున్నట్లు తెలిపారు.
అలాగే వదినపల్లి, నాచారం ప్రాంతాల్లో సోలార్ పవర్ స్టేషన్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారి రైతులకు వ్యవసాయ పనిముట్లు అందజేస్తున్నామని మంత్రి తెలిపారు. రైతులకు రైతు భరోసా పథకం, సన్న వడ్లకు బోనస్ అందిస్తున్నామని పేర్కొన్నారు. అలిమ్ సమస్త సంస్థ మహిళా సాధికారత కోసం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ మహిళలను ముందుకు తీసుకెళ్తోందని మంత్రి అభినందించారు.
గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యం లో మహిళలకు శిక్షణతో పాటు వివిధ సంస్థలను పరిచయం చేయాలని సూచించారు. వయాట్రీస్ మరియు అలిమ్ సంస్థల ద్వారా మూడు మండలాల్లో శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. కుట్టిన వస్త్రాలను మార్కెటింగ్ చేయడంలో కూడా అలిమ్ సంస్థ ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ సంకీర్త్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజబాబు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, డీఆర్డీఓ బాలకృష్ణ, సర్పంచ్ హసీనా భాను తదితరులు పాల్గొన్నారు.
మద్దులపల్లి అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మహాదేవపూర్ మండలం మద్దులపల్లి గ్రా మంలో పలు అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని గ్రామ సర్పంచ్ సరిత రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబును కోరారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబుకు వినతిపత్రం అందజేసిన సర్పంచ్ సరిత మాట్లాడుతూ గ్రామంలోని పలు కాలనీలలో సీసీ రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరారు. అలాగే మల్లన్న దేవుని ఆలయ నిర్మాణానికి అవసరమైన నిధులు విడుదల చేసి గ్రామ అభివృద్ధికి సహకరించాలని అభ్యర్థించారు.




