calender_icon.png 15 August, 2025 | 5:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కుక్కల దాడిలో పలువురికి గాయాలు

15-08-2025 03:20:50 PM

తుంగతుర్తి (విజయక్రాంతి): తుంగతుర్తి మండల కేంద్రంలో స్వాతంత్ర దినోత్సవ వేడుక సందర్భంగా ఐసిడిఎస్ కార్యాలయం వద్ద అటెండర్ గా పనిచేస్తున్న ఏగూరి సంతోషి తో పాటు, పలువురు పై కుక్కలు ఒకేసారి దాడి చేయడంతో గాయాలయ్యాయి. దీనితో వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స జరిపించినట్లు స్థానిక తహసీల్దార్ దయానందు, ఐసిడిఎస్ సిడిపివో శ్రీజ తెలిపారు. గ్రామంలో కుక్కల బెడద లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు