12 April, 2026 | 2:22 AM

తరంగ్ సాంస్కృతిక కార్యక్రమాలు

12-04-2026 12:37 AM

హైదరాబాద్, ఏప్రిల్ 11 (విజయక్రాంతి):స్టాన్లీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్‌లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగం కల్చరల్ క్లబ్ ఆధ్వర్యంలో తరంగ్ 2కే26 సాంస్కృతిక కార్యక్రమాలు అట్టహాసంగా జరిగాయి.ప్రోగ్రామ్ కోఆర్డినేటర్స్ స్వాతిశ్రీ, సౌజన్యాల మార్గదర్శంలో జరిగిన ఈ ప్రోగ్రాంలో పాటలు, నృత్యాలు, నాటికలు సహా పలు ప్రదర్శనలు నిర్వహించారు.

కళాశాల చైర్మన్ కె.కృష్ణారావు మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు వివిధ కళారూపాల్లో కూడా రాణించాలన్నారు. సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా మానసిక ఉల్లాసం చేకూరుతుందని చెప్పారు.ప్రిన్సిపాల్ డాక్టర్ బీయల్ రాజు మాట్లాడుతూ ఎప్పుడూ చదువులో నిమగ్నమై ఉండే విద్యార్థులకు ఇటువంటి సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా వారిలో ఉన్న కళాత్మక స్కిల్స్‌ను గుర్తించి ఆ విధంగా వారిని ప్రోత్సహిస్తామన్నారు. విభాగాధిపతి డాక్టర్ మదన మోహన, ఏఓ ఏ.రమేష్, డాక్టర్ అనీ షా, డాక్టర్ రాధిక, డాక్టర్. శివాని, డాక్టర్ సౌమ్య, డాక్టర్ సుమయ్య, శ్రీలత, జ్ఞాన ప్రసన్న, అనిత, తేజస్వీ తదితరులు పాల్గొన్నారు.