16 April, 2026 | 12:11 PM

Breaking News

వీధి కుక్కల దాడి.. మృత్యువుతో పోరాడి— 15 రోజుల తర్వాత బాలుడు మృతి   •   కామ్రేడ్ పెద్దబ్బాయికు నివాళులర్పించిన పోతినేని సుదర్శన్   •   కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం: ఎనిమిది మంది భక్తులు మృతి   •   మాజీ సర్పంచ్ ను పరామర్శించిన మంత్రి పొంగులేటి   •   స్టేట్ 2వ ర్యాంక్ సాధించిన విద్యార్థినికి ఘన సత్కారం   •   ప్రముఖ గాయని ఆశా భోస్లే మృతి పట్ల లోక్‌సభ సంతాపం   •   డీలిమిటేషన్ పై దేశవ్యాప్తంగా ఉత్కంఠ   •   వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన సర్పంచ్   •   అదృశ్యమైన వ్యక్తి దారుణ హత్య.. పొలాల్లో లభ్యమైన బూడిద, అస్తికలు   •   ఆక్రమణలు తొలగించి అభివృద్ధికి సహకరించండి.   •  

నాగార్జున స్కూల్ ఎదుట ఎస్‌ఎఫ్‌ఐ నాయకుల ధర్నా

24-06-2025 12:41 AM

ఇబ్రహీంపట్నం, జూన్ 23:ప్రభుత్వ నియ మ నిబంధనకు విరుద్ధంగా నాగర్జున హైస్కూ ల్లో పాఠ్య పుస్తకాలు విక్రయించడాన్ని నిరసిస్తూ సోమవారం ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థులు ఇ బ్రహీంపట్నం నాగార్జున హైస్కూల్ ఎదుట నిరసనకు దిగారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలోని నాగార్జున హై స్కూల్ యాజమాన్యం ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఎం.ఆర్.పి కంటే అధిక ధరలకు పాఠ్యపుస్తకాలు విక్రహిస్తున్నారు.

తప్పనిసరిగా విద్యార్థులు తమ పాఠశాలలోనే పుస్తకాలను కొనుగోలు చేయాలని స్కూల్ యాజమాన్యం ఒత్తిడి చే స్తూ, అధిక ధరలకు విద్యార్థులకు అంటగడుతున్నారు.ఈ సందర్బంగా ఎస్‌ఎఫ్‌ఐ డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు బోడ శ్రవణ్, ఏర్పుల తరంగ్ లు మాట్లాడుతూ.. నాగార్జున హై స్కూల్ యాజమాన్యం పాఠ్యపుస్తకాలు, దుస్తులు, షూస్, టై మొదలైనవి ప్రభుత్వ ఎం.ఆర్.పి కంటే అధిక ధరలకు విక్రహిస్తున్నారని, అదేవిధంగా ఆటస్థలం, ఫైర్ సేఫ్టీలు కూడా లేవని అన్నారు. స్కూల్స్ అనుమతులు వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. వెంటనే స్పందించిన ఎంఈఓ ఈర్యా నాయక్ పాఠశాలలోని పుస్తకాలు విక్రయించే గదిని సీజ్ చేశారు.