20 June, 2026 | 3:43 PM

Breaking News

రైతు కుటుంబాన్ని పరామర్శించనున్న కేటీఆర్   •   హైదరాబాద్ రోడ్డుకి ట్రంప్ పేరు పెట్టడాన్ని నిరసిస్తూ నల్ల జెండాలతో ప్రదర్శన   •   'పది'లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహకం   •   జనపనార పైలెట్ ప్రాజెక్టు పై అవగాహన సదస్సు   •   23న రాష్ట్ర వ్యాప్త పాఠశాలల బంద్   •   అనురాగ్ లో 5రోజుల ఉపాధ్యాయ శిక్షణా తరగతులు ప్రారంభం   •   ఎస్‌ఐఆర్ విజయవంతానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి   •   కలెక్టర్ కోయ శ్రీహర్షను అభినందించి, సన్మానించిన ప్రభుత్వ విప్ విజయరమణ రావు   •   జ్యోతినగర్‌లో అభివృద్ధి పనులను ప్రారంభించిన కేంద్ర మంత్రి బండి   •   మండల ఉపసర్పంచుల ఫోరం   •  

సుజాత ఇంటర్నేషనల్ స్కూల్‌పై ఎస్ఎఫ్ఐ ఆగ్రహం

04-04-2026 09:10 PM

అధిక ఫీజుల వసూళ్లపై తల్లిదండ్రుల ధర్నా

– గుర్తింపు రద్దు చేయాలని డిమాండ్ 

ఎస్ఎఫ్ఐ చేవెళ్ల డివిజన్ కార్యదర్శి బ్యాగరి అరుణ్ కుమార్

మొయినాబాద్,(విజయక్రాంతి): మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని సుజాత ఇంటర్నేషనల్ స్కూల్ అధిక ఫీజులు వసూలు చేస్తోందని ఆరోపిస్తూ విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల ముందు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) మద్దతు ప్రకటించి కార్యక్రమంలో పాల్గొంది.

ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ చేవెళ్ల డివిజన్ కార్యదర్శి బేగరి అరుణ్ కుమార్ మాట్లాడుతూ, సుజాత స్కూల్ వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించి దాదాపు 33 శాతం వరకు ఫీజులు పెంచడం పేద, మధ్యతరగతి కుటుంబాలపై భారంగా మారిందని అన్నారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు.

అధిక ఫీజుల సమస్యపై జిల్లా కలెక్టర్, డీఈఓలకు ఫిర్యాదు చేసి స్కూల్ గుర్తింపు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మండల ఎంఈఓ వెంటనే పాఠశాలలో ఫీజులపై విచారణ జరిపి యాజమాన్యానికి నోటీసులు జారీ చేయాలని కోరారు. డిమాండ్లను పట్టించుకోకపోతే ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పాఠశాల ముందు నిరవధిక ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ మొయినాబాద్ మండల కార్యదర్శి చరణ్ గౌడ్, తల్లిదండ్రులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.