11 August, 2026 | 2:03 AM

పీఆర్టీయూ మండల అధ్యక్షుడిగా షేక్ యూసుఫ్ ఏకగ్రీవ ఎన్నిక

11-08-2026 12:16 AM

పాలకవీడు, ఆగష్టు 10 : పాలకవీడు మండల పిఆర్టీయూ నూతన కమిటీ ఎన్నికలు సోమవారం ఏకగ్రీ వంగా జరిగాయి.మండల అధ్యక్షులుగా షేక్ యూ సుఫ్, ప్రధాన కార్యదర్శిగా గోలి తిరుపతి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.అసోసియేట్ అధ్యక్షులుగా కందరబోయిన నాగరాజు, మహిళా అసోసియేట్ అధ్యక్షురాలిగా స్వప్న సపావత్, ఉపాధ్యక్షులుగా రాతికింది అంజయ్య, మహిళా ఉపాధ్యక్షురాలిగా కరుణాబాయి, మండల కార్యదర్శులుగా పెరుమాళ్ల ప్రశాంత్, ఎర్రమళ్ల సైదమ్మ ఎంపికయ్యారు.

ఈ ఎన్నికల కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా అధ్యక్షులు తంగెళ్ల జితేందర్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి తీగల నరేష్ హాజరై నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు ఇంజమూరి కాటయ్య, ఆడిట్ కమిటీ వైస్ చైర్మన్ చల్లా ప్రభాకర్ రెడ్డి, జిల్లా గౌరవ అధ్యక్షులు కొణతం వెంకటరెడ్డి, మండల అధ్యక్షులు కొండ బాలకృష్ణ, ప్రధాన కార్యదర్శి గంధం ధర్మరాజు, రాష్ట్ర బాధ్యులు ప్రకట శేఖర్ జిల్లా బాధ్యులు రూపావత్ గోప, గుగులోతు బాలు, మొక్క రమేష్, వినోద్, గోపి, కిరణ్ కుమార్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.