23 June, 2026 | 1:05 AM

‘హోర్ముజ్’ మీ క్యాసినో కాదు!

23-06-2026 12:23 AM

ఆ జలసంధిపై నిర్ణయాధికారం మాదే

ఇరాన్ నేషనల్ సెక్యూరిటీ కమిటీ చైర్మన్ ఇబ్రహీం అజీజి 

ట్రంప్ వ్యాఖ్యలకు ఘాటుగా సమాధానం

టెహ్రాన్, జూన్ 22: ‘మీరు బెదిరిస్తారు. మేం చర్యలు తీసుకుంటాం. హోర్ముజ్ జలసంధి మీ క్యాసినో కాదు. సముద్ర దొంగ లుండే పెరడు కాదు. ఆ జలసంధిపై తీసుకునే నిర్ణయం ఏదైనా ఇరాన్ చేతిలోనే ఉంది’ అని ఇరాన్ పార్లమెంట్‌లోని నేషనల్ సెక్యూరిటీ కమిటీ చైర్మన్ ఇబ్రహీం అజీజి.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌నకు ఘాటు సమాధానం ఇచ్చారు. ఇజ్రాయెల్‌పై దాడులు చేయకుండా లెబనాన్‌లోని హిజ్బుల్లాను నిలువరించాలని, లేక పోతే ఇరాన్‌పై భీకరదాడులు చేస్తామన్న ట్రంప్ హెచ్చరికలపై ఇబ్రహీం స్పందించారు.

శాంతి ఒప్పందంలోని నిబంధనలను, అమెరికా హెచ్చరికలను బేఖాతరు చేస్తూ లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులతో విరుచుకుపడటంతో మళ్లీ హోర్ముజ్‌ని మళ్లీ మూసివేస్తున్నామని ఇరాన్ ప్రకటించింది. దీంతో ట్రంప్ ఆగ్రహానికి గురయ్యారు. 60 రోజుల్లో ఇరాన్ తుది ఒప్పందం కుదరకపోతే జలసంధి మార్గంలో టోల్ విధిస్తామని హెచ్చరించారు. పశ్చిమాసియా దేశా లకు యూఎస్ అందించిన రక్షణ సేవలకుగానూ ఆ డబ్బును తీసుకోనున్నట్లు వెల్లడిం చారు. ఈ హెచ్చరికలలో హర్మూజ్ జలసంధిలో నౌకల రాకపోకలు నెమ్మదించాయి. హెచ్చరికలకు ముందు రోజుకు 35 నౌకలు దాటగా.. ఆదివారం కేవలం 12 మాత్రమే దాటినట్లు తెలిసింది.