23 June, 2026 | 2:10 AM

శిండే శిబిరంలోకి ఆరుగురు ఎంపీలు

23-06-2026 12:51 AM
  1. శివసేన (యూబీటీ)లో చీలిక ఆటకు తెర
  2. మహారాష్ట్రలో ఆపరేషన్ టైగర్ విజయవంతం

ముంబై, జూన్ 22: మహారాష్ట్రలో కీలక పరిణామం చోటుచేసుకుంది. శివసేన (యూబీటీ)కు చెందిన ఆరుగురు ఎంపీలు శిండే నేతృత్వంలోని శివసేనలో సోమవారం చేరా రు. దీంతో గడిచిన కొన్ని రోజులుగా శివసేన (యూబీటీ)లో చీలికపై నడుస్తున్న రాజకీయ ఎపిసోడ్‌కు తెరపడింది. ‘ఆ ఆరు పులులు ఇప్పుడు అసలైన శివసేన ఫ్యామిలీలోకి వచ్చా యి. వారికి స్వాగతం. ఆపరేషన్ టైగర్ విజయవంతమైంది’ అని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ శిండే ప్రకటించారు.

శిందే క్యాంప్ లో చేరిన ఎంపీల్లో ఓం రాజే నింబాల్కర్, సంజ య్ దినపాటిల్, సంజయ్ జాదవ్, సంజయ్ దేశముఖ్, నగేష్ పాటిల్ ఆష్టికర్, చౌసాహెబ్ వక్చౌరే ఉన్నారు. మొత్తం 9 మంది ఎంపీల్లో ఆరుగురు శిండే క్యాంప్‌లో చేరడంతో పార్టీ ఫిరాయింపుల చట్టం వర్తించకుండా జాగ్రత్త పడినట్లు తెలుస్తోంది.

నాలుగేళ్ల క్రితం(2022 జూన్ 22న) 40 మంది ఎమ్మెల్యేలు తమతో వచ్చారన్న శిండే.. ఇప్పుడు ఏకంగా ‘సిక్స్’ కొట్టామని పేర్కొన్నారు. శివసేన రెండో విడత విస్తరణ ప్రణాళికగా ఈ చేరికను అభివర్ణించా రు. నియోజకవర్గాల అభివృద్ధి కోసమే తా ము శిండే శివసేన పార్టీలోకి వెళ్లినట్లు రెబల్ ఎంపీలు తెలిపారు.