calender_icon.png 17 July, 2025 | 1:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కారుతో గుద్దించి భర్తను చంపించింది!

16-07-2025 12:00:00 AM

  1. ప్రియుడి కోసం భార్య పతకం

తన ప్రియుడు, భర్త ప్రియురాలి భర్త కలిసి హత్య

యాదాద్రి జిల్లా కాటేపల్లిలో ఘటన

ముగ్గురు నిందితుల అరెస్టు

యాదాద్రి భువనగిరి, జూలై 15 (విజయక్రాంతి): వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న తన భర్తను ప్రియుడితోపాటు, భర్త వివాహేతరం సంబంధం పెట్టుకున్న వివాహిత భర్తతో కలిసి కారుతో గుద్దించి హత్య చేయించింది ఓ భార్య. ఆ ఘటన యాదాద్రి జిల్లా మోత్కూర్ మండలం కాటేపల్లిలో శివారులో సోమవారం అర్ధరాత్రి జరిగింది.

ఘటన జరిగిన 24 గంటల్లో హత్యకు సూత్రదారి అయిన మృతిడి భార్య వస్తువుల స్వాతితో పాటు ఆమె ప్రియుడు గుంటి సాయికుమార్, భర్త వివాహేతర సంబంధం పెట్టుకున్న వివాహిత భర్త పొట్టిపాక మహేష్‌లను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. మరో ప్రధాన నిందితుడైన  భువనగిరి పట్టణానికి చెందిన తాతా నగర్ నివాసి చీమల రామలింగస్వామి పరారీలో ఉన్నాడు. డీసీపీ ఆకాంక్షయాదవ్ మంగళవారం వివరాలు వెల్లడించారు. 

ఆత్మకూర్(ఎం) మండలం పల్లెర్ల గ్రామానికి చెందిన వస్తువుల స్వామి(38)కి 20 ఏళ్ల క్రితం స్వాతితో వివాహం జరిగింది. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. స్వామి మోత్కూరు మండల కేంద్రంలోని ట్రాక్టర్ షోరూమ్ మేనేజర్‌గా పనిచేస్తు వలిగొండ, మోత్కూ రు, ఆత్మకూరు బ్రాంచీలలో కూడా బాధ్యత లు నిర్వహిస్తున్నాడు. స్వాతి గతంలో భువనగిరి హౌసింగ్‌బోర్డ్ ఎస్‌ఎన్ మోటార్స్ షాప్‌లో పనిచేసేది.

ఆ సమయంలో సాయికుమార్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అయితే ఆ తర్వాత ఆ మోటార్స్ కంపెనీ మూతపడటంతో మోత్కూర్‌లో తన భర్త పని చేస్తున్న సోనాలిక ట్రాక్టర్ షోరూంలోనే పనిచేస్తున్నది. కొన్ని రోజుల క్రితం సాయికుమార్ మోత్కూర్‌లో తారాసపడగా.. ఒకరికొ కరు ఫోన్ నెంబర్లు ఇచ్చుకొని ప్రతిరోజు మాట్లాడుకునేవారు. ఇది వారిద్దరి మధ్య వివాహేతర సంబంధానికి దారి తీసింది.

ఇదిలా ఉండగా స్వాతికి సోదరుడు వరుస అయ్యే మహేష్ భార్యతో స్వామి వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం మహేష్‌కు తెలిసి స్వామిపై పగ పెంచుకున్నాడు. భర్త వివాహేతర సంబంధం విష యం తెలిసిన స్వాతి కూడా భర్తను హెచ్చరించింది. అప్పటి నుంచి స్వాతిని స్వామి శారీ రకంగా, మానసికంగా వేధింపులకు గురిచేస్తూ వస్తున్నాడు. విసిగిపోయిన స్వాతి.. తన భర్తను హత్య చేయించాలని నిర్ణయానికి వచ్చింది.

ఈ నేపథ్యంలో ఆమె ప్రియుడు సాయికుమార్, ఆమె సోదరుడు మహేష్‌తో కలిసి ప్లాన్ వేశారు. అదును కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో స్వామి ఈ నెల 13న భువనగిరికి వెళ్లాడు. విషయం తెలిసిన ఆ ముగ్గురు ఇదే అదునుగా భావించారు. సాయికుమార్ తన స్నేహితుడు చీమ ల రామలింగ స్వామి సహాయంతో భువనగిరి పట్టణానికి చెందిన ఒక వ్యక్తి నుంచి కారును తీసుకున్నారు.

ఆరోజు మొత్తం స్వామిని అనుసరించారు. భువనగిరి నుంచి తన మిత్రుడు వీరబాబుతో కలిసి స్వామి బైక్‌పై స్వగ్రామానికి బయలుదేరాడు. రాయగిరి నుంచి మోత్కూర్ రోడ్డు మీదుగా వెళ్తుం డగా నిందితులు బైకును వెంబడించారు. కాటేపల్లి శివారులోకి రాగానే కారుతో బైకు ను వెనుక నుంచి ఢీకొట్టారు.

బైక్ అదుపుతప్పి ఎదురుగా ఉన్న చెట్టును ఢీకొట్టడంతో స్వామి తలకు బలమైన గాయాలై అక్కడికక్క డే చనిపోయాడు. గాయాల పాలైన వీరబాబును చికిత్స మిత్తం భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు. స్వాతి, సాయికుమార్, మహేష్‌లను పోలీసులు అరెస్టు చేశా రు. లింగస్వామి పరారీలో ఉన్నాడని డీసీపీ తెలిపారు.