హుస్సేన్‌సాగర్‌లో దూకి ఆత్మహత్యాయత్నం
13-06-2024 01:58 AM
కాపాడిన కానిస్టేబుల్
హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 12 (విజయక్రాంతి) : హుస్సేన్‌సాగర్‌లో దూకి ఓ వ్యక్తి ఆత్మహత్యాయ త్నానికి పాల్పడ్డాడు. అప్రమత్తమైన కానిస్టేబుల్ హుస్సేన్‌సాగర్‌లోకి దిగి అతన్ని కాపాడాడు. అనంతరం పోలీసులు ఆ వ్యక్తిని అంబులెన్స్‌లో స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఆ వ్యక్తి ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు పేర్కొన్నారు. అయితే, ఆత్మహత్యకు పాల్పడ్డ వ్యక్తి ఎవరు? ఎందుకు ఆత్మహత్యాయ త్నం చేశాడు? అనే విషయం తెలియాల్సి ఉంది. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.






