calender_icon.png 5 August, 2025 | 12:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శిబూ సోరెన్ ఇక లేరు

05-08-2025 01:37:21 AM

- కిడ్నీ సంబంధిత సమస్యతో మాజీ ముఖ్యమంత్రి కన్నుమూత

- మూడుసార్లు సీఎంగా.. ఒకసారి కేంద్ర మంత్రిగా సేవలు

- ఆదీవాసీల ఉద్ధరణ కోసం అలుపెరగని పోరాటం

- జార్ఖండ్ రాష్ట్ర ఏర్పాటులో కీలకపాత్ర

- సంతాపం ప్రకటించిన రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ

రాంచీ, ఆగస్టు 4: జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి, జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) పార్టీ అధినేత శిబూ సోరెన్ (81) సోమవారం కన్నుమూశారు. నెలరోజులకు పైగా శిబూ సోరెన్ ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆ సుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మూత్ర పిండాల సంబంధిత సమస్యల కారణంగా సోరెన్ జూన్ చివరి వారంలో గంగారాం ఆసుపత్రిలో చేరారు. సోమవారం శిబూ సోరెన్ మృతి చెందినట్టు.. జార్ఖండ్ ముఖ్యమంత్రి, సోరెన్ తనయుడు హేమంత్ సోరెన్ ప్రకటించారు.

‘మన ప్రియతమ నేత దిషో మ్ గురూజీ మనల్ని విడిచి వెళ్లిపోయారు. నాకు సర్వస్వం కోల్పోయినట్టు ఉంది’ అని బాధాతప్త హృదయంతో ప్రకటించారు. మూడు పర్యాయాలు జార్ఖండ్ ముఖ్యమంత్రిగా పని చేసిన శిబూ సోరెన్‌ను ఆయన అభిమానులు ముద్దుగా ‘దిషోమ్ గురు’ అని పిలుచుకునేవారు. శిబూ సోరెన్ సతీమ ణి రూపో సోరెన్. వీరికి నలుగురు సంతా నం. ముగ్గురు కుమారులు హేమంత్ సోరె న్, బసంత్, దుర్గా సోరెన్, కుమార్తె అంజలి. 2009లో దుర్గా సోరెన్ మృతి చెందగా.. బసంత్ ఎమ్మెల్యేగా.. హేమంత్ సోరెన్ జా ర్ఖండ్ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు.

జార్ఖండ్ రాష్ట్ర ఏర్పాటుకు పోరాటం..

శిబూ సోరెన్ ప్రస్తుతం బీహార్‌లో భాగమైన రామ్‌గఢ్ జిల్లాలో  1944 జనవరి 11న జన్మించారు. సంతాల్ కమ్యూనిటీకి చెం  దిన శిబు సోరెన్.. వామపక్ష నేత ఏకే రాయ్, కుర్మి మహాతో బినోద్ మహతోతో కలిసి 1972లో జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) ను ఏర్పాటు చేశారు. తర్వాత ప్రత్యేక రాష్ట్రం కోసం చేసిన పోరాటంలో ఆయన కీలకపా త్ర వహించారు. శిబూ సోరెన్ పోరాటం ఫలితంగా 2000లో జార్ఖండ్ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది. శిబూ సోరెన్‌కు నాలుగు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉంది.

దమ్కా లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఏకంగా ఎనిమిది సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. రెం డుసార్లు రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు. మూడుసార్లు జార్ఖండ్ ముఖ్యమం త్రిగా (2005, 2008, 2009) పనిచేశారు.  ఆయన మూడుసార్లు ముఖ్యమంత్రిగా బా ధ్యతలు చేపట్టినప్పటికీ ఒక్కసారి కూడా పూర్తికాలం పదవిని నిర్వహించలేకపోయా రు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ క్యాబినెట్‌లో శిబూ సోరెన్ కేంద్ర బొగ్గు గనుల శా ఖ మంత్రిగా కూడా పనిచేశారు. అయితే 1974 నాటి కేసు ( మాజీ కార్యదర్శి హత్య కేసులో) శిబూ సోరెన్ దోషిగా తేలడంతో మంత్రి పదవిని కోల్పోవాల్సి వచ్చింది. ఆ తర్వాత ఢిల్లీ హైకోర్టు ఆయన్ను నిర్దోషిగా తేల్చింది. 

సంతాపాల వెల్లువ..

శిబూ సోరెన్ మృతిపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన తనయుడు, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌ను పరామర్శించారు.  కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా తదితరులు శిబూ సోరెన్‌కు నివాళి అర్పించిన వారిలో ఉన్నారు.  


శిబూ సోరెన్ మరణం సామాజిక న్యాయ రంగానికి పెద్ద నష్టం. గిరిజన గుర్తింపు, జార్ఖండ్ రాష్ట్ర ఏర్పాటులో కీలకపాత్ర పోషించారు. హేమంత్ సోరెన్ కుటుంబానికి ప్రగాడ 

సానుభూతి రాష్ట్రపతి ముర్ము

గిరిజన, పేద, అణగారిన వర్గాలకు సాధికారత కల్పించేందుకు శిబూ సోరెన్ ఎనలేని కృషి చేశారని ప్రధాని మోదీ పేర్కొన్నారు. అట్టడుగు స్థాయి నుంచి ప్రజాజీవితంలో ఉన్నత స్థాయికి ఎదిగారని గుర్తు చేశారు. 

 ప్రధాని మోదీ

గిరిజన సమాజానికి బలమైన గొంతుక.. శిబూ సోరెన్. జీవితాంతం వారి హక్కులు, ప్ర యోజనాల కోసం పోరాడారు. జార్ఖండ్  ఏర్పాటులో ఆయన పాత్ర మరువలేనిది

 రాహుల్ గాంధీ

జార్ఖండ్ ప్రత్యేక రాష్ట్ర సాధనలో, గిరిజన సమస్యల పరిష్కా రంలోనూ మడమతిప్పని పోరా టం చేసిన యోధుడు శిబూ సోరెన్. చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు ఆయన ఎనలేని కృషి చేశారు.

 సీఎం రేవంత్

ఆదివాసీ ప్రజల హక్కులు, సంక్షేమం కోసం, జార్ఖండ్ ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడిన శిబూ సోరెన్ త్యాగాన్ని దేశం ఎప్పటికీ మర్చిపోదు. 

 భట్టి విక్రమార్క, డిప్యూటీ సీఎం

శిబూ సోరెన్ మరణం జార్ఖండ్, తెలంగాణ వంటి దేశ ప్రాంతీయ అస్తిత్వ రాజకీయాలకు, జాతీయ ఫెడరల్ స్ఫూర్తికి, ఆదివాసీ సమాజానికి తీరని లోటు. ఆయనతో తనకున్న వ్యక్తిగత అనుబంధం, తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి వారందించిన సహకారం ఎన్నటికీ మరువం.

 మాజీ సీఎం కేసీఆర్

జార్ఖండ్ మాజీ సీఎం శిబూ సోరెన్ మ రణం తీవ్రంగా కలిచివేసింది. స్వయం పాలన, గిరిజన హక్కుల కోసం అవిశ్రాంతంగా పోరాడిన  యోధుడు. ఆయన మరణం దేశానికి తీరని లోటు.

 బీఆర్‌ఎస్ వర్కింట్ ప్రెసిడెంట్ కేటీఆర్