తుఫాన్‌లో చిక్కుకుపోయిన నావ బీఆర్‌ఎస్
18-12-2024 02:34 AM
* డిప్యూటీ సీఎం భట్టి
హైదరాబాద్, డిసెంబర్ 17 (విజయక్రాంతి): తుఫాన్‌లో చిక్కుకున్న నావలా బీఆర్‌ఎస్ పరిస్థితి దీనంగా ఉందని, ఆ నావను నడిపే కెప్టెన్ కూడా లేడని డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క ఎద్దేవాచేశారు. అసెంబ్లీ లాబీలో మంగళవారం భట్టి మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ నావ ఇప్పుడు ఎక్కడ.. ఎప్పుడు తేలుతుందో తెలియదని అన్నారు. పార్టీ ప్రధాన నేత సభకు రాకుంటే, పరిస్థితి ఇలాగే ఉంటుందని పరోక్షంగా కేసీఆర్‌ను ఉద్దేశించి వ్యా ఖ్యలు చేశారు. ప్రజాసమస్యలపై శాసనసభలో చర్చ జరగాలనే ఉద్దేశం బీఆర్‌ఎస్‌కు లేదని విమర్శించారు. కూలీలకు డబ్బు ఇస్తామంటే బీఆర్‌ఎస్ వద్దంటుందని, రైతులకు మేలు జరగడం ఆ పార్టీకి ఇష్టం లేదన్నారు. బీఆర్‌ఎస్ సభ్యులు ప్రివిలేజ్ మోషన్ ఎందుకు పెట్టారో వారికే తెలియదని ఫైర్ అయ్యారు.






