బీజేపీ, బీఆర్‌ఎస్‌వి చీకటి ఒప్పందాలు
* ప్రభుత్వ విప్ బీర్ల ఐల్యయ్య
హైదరాబాద్, డిసెంబర్ 17 (విజయక్రాంతి): బీజేపీ, బీఆర్‌ఎస్‌ల చీకటి ఒప్పందాలను ప్రజలు గమనిస్తున్నారని ప్రభుత్వ విప్ బీర్ల ఐల్యయ్య పేర్కొన్నారు. మంగళవారం అసెంబ్లీలో మీడియా పాయింట్ వద్ద ఆయన విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యేలు రామ్మోహన్‌రెడ్డి, శంకరయ్య, విజయరమణరావు తో కలిసి మాట్లాడారు. రైతులకు, తల్లులకు బేడీలు వేసిన చరిత్ర బీఆర్‌ఎస్‌ది అని దుయ్యబట్టారు. ప్రజల్లో అలజడి సృష్టించాలన్న ఆలోచనలతో బీఆర్‌ఎస్ నడుచుకుంటోందని మండిపడ్డారు.
రైతుల సమస్యలు పరిష్కరించని బీజేపీ కూడా మొసలికన్నీరు కారుస్తోందని ధ్వజమెత్తారు. అసెంబ్లీలో ప్రతి అంశాన్ని చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని, ప్రతిపక్షాలు కూడా సిద్ధమేనా? అని ప్రశ్నించారు. గతంలో బీఆర్‌ఎస్ విస్మరించిన క్రీడలపై ఒక పాలసీ తెచ్చినట్టు చెప్పారు. పర్యాటక రంగం అభివృద్ధికి ఒక పాలసీని తీసుకొచ్చామని, వాటికి మద్దతు ఇవ్వకుండా అడ్డుకోవడంపై మండిపడ్డారు.
గతంలో వికారాబాద్‌కు అన్యాయం: రామ్మోహన్‌రెడ్డి
కనీసం స్పీకర్‌పై కూడా గౌరవం లేకుండా ప్రతిపక్షాలు వ్యవహరించాయని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి విమర్శించారు. గతంలో దళితుడైన సంపత్‌కుమార్‌ను సభ నుంచి శాశ్వతంగా బహిష్కరించిన విషయాన్ని గుర్తుచేశారు. తమ జిల్లా వికారాబాద్‌కు బీఆర్‌ఎస్ అన్ని విధాలా అన్యాయం చేసినట్టు పేర్కొన్నారు.
వ్యవస్థలను చక్కద్దిదుతున్నాం: విజయరమణరావు
దళిత నాయకుడైన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పది నిమిషాలు లేట్ అ యితే ప్రశ్నించిన బీఆర్‌ఎస్ సభ్యులు.. ప్రస్తుత ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ ఒక్కరోజన్నా అసెంబ్లీకి వచ్చారా? అని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణరావు ప్రశ్నించారు. గత ప్రభుత్వం నాశనం చే సిన అన్ని వ్యవస్థలను చక్కదిద్దే ప్రయ త్నం చేస్తున్నామని స్పష్టంచేశారు. బీఆర్‌ఎస్ నాయకులు అసెంబ్లీని అడ్డుకునే ప్ర యత్నం చేస్తున్నారని మండిపడ్డారు. రా ష్ట్ర ప్రజలు అన్నీ గమనిస్తున్నారన్నారు.
గోరంతను కొండంత చేస్తున్నారు: శంకరయ్య
లాగచర్ల ఘటన విషయంలో గోరంతను కొండంత చేస్తున్నారని షాద్‌నగర్ ఎమ్మెల్యే శంకరయ్య అన్నారు. ఖమ్మంలో మిర్చి రైతులకు బేడీలు వేసింది మర్చిపోయి ఇప్పుడు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. బీజేపీ నాయకులు రాష్ట్రానికి ఎన్ని నిధులు తెచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు.
మీ పాపాలకు జైళ్లు సరిపోవు: రాజేందర్‌రెడ్డి
బీఆర్‌ఎస్ నాయకులు చేసిన పాపాలకు జైళ్లు సరిపోవని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి పేర్కొన్నారు. ఒక్కొక్కరు వేల కోట్ల రూపాయ లు సంపాదించింది నిజం కాదా? అని ప్రశ్నించారు. తాను చెప్పింది చాలా తక్కువ అన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం దొంగ లెక్కలు బయటపడొద్దన్న ఉద్దేశంతోనే సభను నడవనీయడం లేదని ఆగ్రహించారు.






