calender_icon.png 5 October, 2025 | 8:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహాదేవ నాయుడుగా శివాజీ

05-10-2025 01:11:49 AM

యూట్యూబ్‌లో తనకంటూ ఓ ప్రత్యేక మార్క్‌ను క్రియేట్ చేసుకున్న షణ్ముఖ్ జస్వంత్ హీరోగా రూపొందుతున్న చిత్రం ‘ప్రేమకు నమస్కారం’. ఈ చిత్రానికి వీ భీమశంకర్ దర్శకుడు. ఏబీ సినిమాస్ పతాకంపై అనిల్ కుమార్ రావాడ, భార్గవ్ మన్నె నిర్మిస్తున్నారు. ఇందులో ఉల్క గుప్తా హీరోయిన్‌గా నటిస్తోంది. ఇందులో భూమిక ముఖ్యపాత్రను పోషిస్తున్నారు. శివాజీ ‘మహాదేవ నాయుడు’గా శక్తిమంతమైన పాత్రలో కనిపించబోతున్నారు. మహాదేవనాయుడు పాత్రను పరిచయం చేస్తూ మూవీటీమ్ విడుదల చేసిన ఓ ప్రత్యేక వీడియో ఆకట్టుకుంటోంది.

మహాదేవ నాయుడు పాత్ర ఎంత పవర్‌ఫుల్‌గా ఉండబోతుందో ఈ వీడియో చూస్తే అర్థమవుతోంది. బ్రహ్మాజీ, శ్రీకాంత్ అయ్యంగార్, అరుణ్ అదిత్, రంగస్థలం మహేశ్, మణిచందన, కమల్, క్రాంతి, నీల రమణ, శోభన్, సుభాష్, కొటేశ్వరరావు వివిధ పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: గ్యానీ; గీత సాహిత్య: రామజోగయ్య శాస్త్రి, దినేశ్ కాకెర్ల; డీవోపీ: కిషోర్ బోయిడపు; ఎడిటర్: కేసీబీ హరి; ఆర్ట్: రవికుమార్.