calender_icon.png 5 October, 2025 | 6:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గానం.. వెన్నెల కిశోర్!

05-10-2025 01:13:10 AM

విక్రాంత్, చాందినీ చౌదరి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘సంతాన ప్రాప్తిరస్తు’. మధుర ఎంటర్‌టైన్‌మెంట్, నిర్వి ఆర్ట్స్ బ్యానర్లపై ఈ చిత్రాన్ని సంజీవ్‌రెడ్డి యూత్‌ఫుల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాతో స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ గాయకుడిగా మారారు. ఈ చిత్రంలో ఆయన డాక్టర్‌గా నటిస్తుండ గా ఆ పాత్ర నేపథ్యంలో సాగే పాట  పాడారు.

‘అనుకుందొకటిలే.. అయ్యిందొకటిలే.. అయి పోలేదులే..’ అంటూ సాగుతోందీ పాట. సునీల్ కశ్యప్ స్వరపర్చిన ఈ గీతానికి బాలవర్థన్ సాహిత్యం అందించారు. తరుణ్ భాస్కర్, అభినవ్ గోమ టం, మురళీధర్‌గౌడ్, తాగుబోతు రమేశ్, కిరీటి, అనీల్ గీల, సద్దాం వివిధ పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది.