నీటి ఎద్దడిపై యుద్ధ ప్రాతిపదికన పనులు
లాండసాంగి పంప్ హౌస్‌ను పరిశీలించిన చైర్ పర్సన్ అనూష
ఆదిలాబాద్, మార్చి 11 (విజయక్రాంతి): ఆదిలాబాద్ మున్సిపాలిటీలో నెలకొన్న నీటి సమస్యపై నూతన చైర్పర్సన్ బండారి అనూష ప్రత్యేక దృష్టి సారించింది. పట్టణ ప్రజలకు తాగునీరు అందించే లాండసాంగి పంప్ హౌస్ ను బుధవారం పలువురు కౌన్సిలర్ లతో కలిసి ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా లాండసాంగి పంప్ హౌస్ లో 500 KV ట్రాన్స్‌ఫార్మర్ కాలిపోవడంతో, మరమ్మ త్తు పనులను ఛైర్పర్సన్ దగ్గరుండి పరిశీలించి,
పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఛైర్పర్సన్ అనూష మాట్లాడుతూ పట్టణంలో గత రెండు రోజుల నుండి నీటి సరఫరా లేదని, దీంతో పనులను స్వయంగా పర్యవేక్షించి, పనులు పూర్తి చేసేలా చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు. లిసి వినతి పత్రం ఇచ్చామని తెలిపారు. కార్యక్రమంలో కౌన్సిలర్ లు చరణ్ గౌడ్, ఇజ్జగిరి సంజయ్, మాజీ కౌన్సిలర్ సతీష్ పాల్గొన్నారు.




