13 July, 2026 | 9:40 PM

Breaking News

నులిపురుగులను నిర్మూలిద్దాం... ఆరోగ్యాన్ని కాపాడుకుందాం   •   ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •  

ఓటమి ఎరుగని ఎర్రన్న!

16-02-2026 01:21 AM

మూడోసారి వార్డు కౌన్సిలర్‌గా సోమయ్య 

మహబూబాబాద్, ఫిబ్రవరి 15 (విజయక్రాంతి): మహబూబాబాద్ మున్సిపాలిటీగా ఏర్పడ్డ తర్వాత ఇప్పటివరకు మూడుసార్లు జరిగిన ఎన్నికల్లో వరసగా మూడోసారి సీపీ ఎం నుంచి వార్డు కౌన్సిలర్‌గా సూర్ణపు సోమయ్య ఎన్నికై ఓటమి ఎరుగని ఎర్రన్నగా పేరు గడించాడు. మానుకోట మున్సిపల్ కౌన్సిలర్‌గానే కాకుండా 1995 నుంచి ఇప్పటివరకు జరిగిన పంచాయతీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసిన ఆయన ప్రతిసారి విజయం సాధించడం మరో విశేషం.

1995 లో ఎంపీటీసీగా, తర్వాత మహబూబాబాద్ గ్రామ పంచాయతీ వార్డు సభ్యుడిగా రెండుసార్లు ఎన్నికయ్యారు. మహబూబాబాద్ మున్సిపాలిటీగా ఆవిర్భవించిన అనంతరం తొలిసారి జరిగిన ఎన్నికల్లో వార్డు కౌన్సిలర్‌గా ఎన్నికై వైస్ చైర్ పర్సన్‌గా బాధ్యతలు చేపట్టారు. రెండోసారి ఎన్నికై సీపీఎం మున్సిపల్ ఫ్లోర్ లీడర్‌గా బాధ్యతలు నిర్వహిం చారు. తాజాగా మూడోసారి జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుతో 29వ వార్డు కౌన్సిలర్‌గా మరోసారి ఎన్నికయ్యారు.