ప్రమోషన్లలో బీసీలకు కోటా వద్దా?
రిజర్వేషన్లు ఎస్సీ, ఎస్టీ, ఓబీ సీ వర్గాలకు భారత రాజ్యాంగం కల్పించి న ఒక ప్రాథమిక హక్కు. అందుకే రాజ్యాంగంలోని ఆర్టికల్ 15, ఆర్టికల్ 16లను ప్రాథమిక హక్కుల విభాగంలో చేర్చారు (పార్ట్ III). ఇవి ఎవరి విచక్షణ, దయాదాక్షిణ్యాలపై ఆధారపడి లేవు. శతాబ్దాలుగా నిచ్చెన మెట్ల కులవ్యవస్థ అణచివేత ద్వారా సృష్టించిన సామాజిక, విద్య, ఆర్థిక అసమానతలను సరిదిద్దడానికి రూపొందించి న న్యాయబద్ధమైన వ్యవస్థ, సామా జిక వి ప్లవానికి నాంది పలికిన వ్యవస్థ ఇది. వి ద్యారంగంలో సమాన అవకాశాలను క ల్పించడానికి, ప్రత్యేకించి వెనుకబడిన వ ర్గాల అభివృద్ధి కోసం ప్రత్యే క నిబంధనలు చేయడానికి రాష్ట్రానికి/కేంద్రానికి ఆర్టికల్ 15 అధికారం కల్పిస్తుంది.
ఇందులో 15(4), 15(5), 15(6) వంటి ఉపవిభాగాల ద్వారా విద్యాసంస్థల్లో రిజర్వేషన్లకు రా జ్యాంగబద్ధత కల్పించబడింది. అదేవిధం గా, ఆర్టికల్ 16 ప్రభుత్వ ఉద్యోగాల్లో సమా న అవకాశాలను నిర్ధారించడమే కాకుండా, 16(4) ద్వారా రాష్ట్ర/ కేంద్ర సేవల్లో తగిన ప్రాతినిధ్యం లేని వెనుకబడిన వర్గాల పౌ రులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించడానికి రాష్ట్రానికి/ కేంద్రానికి అధికారం ఇవ్వబడింది. ఇది సమాన అవకాశా ల సాకారానికి, ఎస్సీ, ఎస్టీ, ఇతర వెనుకబడిన వర్గాలకు న్యాయమైన ప్రాతినిధ్యం కల్పించడానికి ఉద్దేశించిన ఒక సాధికార నిబంధన. ఇది ప్రభుత్వ సేవల్లో వారి ప్రా తినిధ్యాన్ని పెంచే, సామాజిక న్యాయాన్ని కల్పించే కీలకమైన నిబంధన.
రాజ్యాంగంలోని ఆర్టికల్ (16(4))లో ‘వెనుకబడున తరగతులు’ అనే పదాన్ని వాడారు. అయితే ఎవరు ఈ వెనుకబడిన తరగతులు అనే అంశంపై న్యాయస్థానాలు తర్వాత కాలంలో ఎస్సీలు, ఎస్టీలు, ఇతర వెనుకబడిన తరగతులుగా వ్యాఖ్యానించాయి. ఆర్టికల్ 16(4) ప్రకారం, మొదటి నుంచి అంటే 1950 నుంచి ఎస్సీ, ఎస్టీలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు ఉద్యోగాలలో కల్పించారు. అదేవిధంగా ప్రమోషన్లలోనూ రిజర్వేషన్లను 1955లో కల్పించారు.
అయితే బీసీలు ఎవరనేది నిర్ధారణ కాకపోవడంతో, 1993 వరకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో బీసీలకు రిజర్వేషన్ లేని పరిస్థితి ఏర్పడింది. అయితే, అప్పటివరకు ప్రమోషన్లలో రిజర్వేషన్లను అనుభవిస్తున్న ఎస్సీ/ఎస్టీ వర్గాలకు 1992 లో ఇందిరా సహాని కేసులో ప్రమోషన్లలో రిజర్వేషన్లు చెల్లవని సుప్రీంకోర్టు రాజ్యాం గ ధర్మాసనం తీర్పుచెప్పింది. రిజర్వేషన్లు మొదట అపాయింట్‌మెంట్లకే పరిమితమని, ప్రమోషన్లలో ఇవ్వడం చట్ట విరుద్ధ మని వ్యాఖ్యానించింది.
దీంతో, బెంబేలెత్తిన అప్పటి కాంగ్రెస్ ప్రధాని పీవీ నరసిం హారావు 1995లో 77వ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చి, ఆర్టికల్ 16ఏ ను రాజ్యాం గంలో చేర్చి, ఎస్సీ, ఎస్టీలకు మాత్రమే ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించారు. అలాగే తర్వాత కాలంలో సుప్రీంకోర్ట్ క్యాచ్ అప్ రూల్ తీర్పును అధిగమించటానికి వాజపేయి ప్రభుత్వం 2001లో 85వ రాజ్యాంగ సవరణ చేసి పర్యవసానం సీనియారిటీని ఆర్టికల్ 16 (4ఏ)లో చేర్చింది. కానీ, అప్పటికే ఇందిరా సహాని కేసులో ఓ బీసీలకు కూడా 27 శాతం రిజర్వేషన్లు అ మలుపరచాలని తీర్పు ఇచ్చారు. 1993 నుంచి అమలులో ఉంది కాబట్టి, ప్రమోషన్లలోనూ 27% వరకు రిజర్వేషన్లు ఓబీసీల కు ఇవ్వవచ్చు.
ఆ విధంగా 77వ రాజ్యాంగ సవరణలో చేర్చినట్టయితే, ఓబీసీలు కూ డా లబ్ధిపొందే అవకాశం ఉండేది. కానీ, నాటి ప్రభుత్వం ఓబీసీల పట్ల అతి క్రూరం గా వ్యవహరించి, ప్రమోషన్లలో రిజర్వేషన్లు రాకుండా ఉద్దేశపూర్వకంగా అడ్డుకొ ని ఓబీసీల నోట్లో మట్టికొట్టింది. అలాగే, తర్వాతి కాలంలో 77వ రాజ్యాంగ సవరణ చట్టం నాగరాజు అండ్ ఇతరులు వర్సెస్ యూనియ న్ అఫ్ ఇండి యా కేసులో సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేయడమైనది.
ఈ కేసులో (2006) సు ప్రీంకోర్టు 16(4ఏ) చెల్లుబాటును అంగీకరించింది. అలాగే మూడు సూత్రాలను ప్రతిపాదించింది. ఒకటి, ఎస్సీ, ఎస్టీలకు ఉద్యోగాల్లో తగినంత ప్రాతినిధ్యం లేనప్పుడే ఈ ప్రమోషన్లలో రిజర్వేషన్లు పరిగ ణించాలి. రెండవది, ఈ ప్రమోషన్ ఇచ్చేటప్పుడు వాళ్లు సామాజికంగా, విద్యాపరం గా వెనుకబడ్డ వర్గాలకు చెందినవారై ఉం డాలి. మూడవది, పరిపాలన సామర్థ్యాన్ని దెబ్బతీసేలాగా ఉండకూడదు.
ఈ సందర్భంలో ఒక ముఖ్యమైన విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి . ఆర్టికల్ 16(4)లో బ్యాక్‌వర్డ్ క్లాసెస్ అంటే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలు. మరి ఎస్సీ, ఎస్టీలకు మా త్రమే ఇచ్చి ఓబీసీలకు ఇవ్వకపోవడం రా జ్యాంగపరమైన వివక్ష తప్ప ఇంకోటి కా దు. ఈ వివక్షలను మొదటినుంచీ ప్రభుత్వాలు బీసీల పట్ల చూపుతూనే ఉన్నాయి. ఆధిపత్య, అగ్ర, పాలక వర్గాలు మొదటినుంచి ఓబీసీ రిజర్వేషన్లను అడ్డుకుంటూనే ఉన్నాయి.
ఫలితంగా లక్షలాది ఉద్యోగాలు బీసీలు కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకే బీసీలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో, ప్రమోషన్లలో సరైన న్యాయం జరగక నేడు దయనీయమైన స్థితిలో బతకాల్సిన పరిస్థి తి ఏర్పడింది. ఓబీసీలకు ప్రమోషన్లలో రి జర్వేషన్ తీసుకురావాలంటే సాధారణ పా లసీ మార్పులు సరిపోవు. రాజ్యాంగ, న్యా య, రాజకీయ స్థాయుల్లో సమగ్ర చర్యలు అవసరం.
1. రాజ్యాంగ సవరణ - ప్రస్తుతం ఉన్న ఆర్టికల్ 16(4ఏ) ఎస్సీ/ ఎస్టీలకు మాత్రమే వర్తిస్తుంది. దీనిలో ఓబీసీలను చేర్చేలా రాజ్యాంగ సవరణ చేయాలి. పార్లమెంట్‌లో రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశ పెట్టాలి. ప్రత్యేక మెజారిటీతో అది ఆమో దం పొందాలి. ఇది జరిగితేనే ఓబీసీలకు లీగల్ బేస్ వస్తుంది.
2. నాగరాజు కేసులోని సుప్రీంకోర్టు విధించిన ట్రిపుల్ టెస్ట్‌ను సంతృప్తిపరచాలి.
3. ఓబీసీలు ఇంకా వెనుకబడి ఉన్నారు. సమగ్ర కులగణన లాంటి లెక్కలు ఉపయోగపడుతాయి
2. తగినంత ప్రాతినిధ్యం లేదనే సాధికారకమైన సమాచారం, నిరూపణ. 2024 జనవరి 1 నాటి ప్రభుత్వ గణాంకాల ప్రకారం ఇప్పటికీ బీసీలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో 26.31 శాతం మాత్రమే ఉన్నారు. అలాగే గ్రూప్ ఏ ఉద్యోగాలలో 19.14%, గ్రూప్ బీ ఉద్యోగాలలో 21.95 % మాత్రమే ఉన్నారు. అంటే ఉన్నత ఉద్యోగాలలో నేటికీ 27% రిజర్వేషన్ స్థాయి కూడా చేరలేరు. అందుకే ప్రమోషన్లలో రిజర్వేషన్లు అవసరం. రాహుల్ గాంధీ లెక్కల ప్రకారం భారత ప్రభుత్వంలోని 90 మంది కార్యదర్శుల్లో ముగ్గురు మాత్రమే ఓబీసీలు ఉన్నారు. కేవలం 5% బడ్జెట్‌పై నియంత్రణ కలిగి ఉన్నారు.
1. పరిపాలన సామర్థ్యం దెబ్బతినదనే నిరూపణ నిజానికి ప్రమోషన్ స్థాయికి వచ్చే వరకే ఆ పోస్ట్‌కు కావాల్సిన అర్హతలు, డిపార్ట్‌మెంటల్ పరీక్షలు పాస్ అవుతారు. అలాగే అతని పనితనంపై రహస్య వార్షిక నివేదికలు ఉంటాయి. కాబట్టి సామర్థ్యం దెబ్బతింటుందనే ప్రశ్నయే ఉత్పన్నం కాదు. ప్రమోషన్లలో రిజర్వేషన్లు ఇవ్వడానికి కావలసిన అర్హతలు, అన్నీ ఉన్నాయి. కానీ లేనిదేమిటి? పొలిటికల్ విల్, రాజకీయ శక్తి, ఒత్తిడి. ఇది అసలు కీ పాయింట్. ఎస్సీ/ ఎస్టీలకు ప్రమోషన్లలో రిజర్వేషన్ రావడానికి కూడా రాజకీయ ఉద్యమాలే కారణం. అదే విధంగా ఓబీసీలకు కూడా బలమైన సామాజిక ఉద్యమం, ఐక్యత, రాజకీయ ప్రాతినిధ్యం లేకపోతే ఇది పాలసీగా రావడం చాలా కష్టం.
ప్రమోషన్లలో రిజర్వేషన్ ఎందుకు ?
బీసీల స్వాభిమానానికి, అధికారానికి ఇది కీలకం. భారతదేశంలో రిజర్వేషన్ అనే వ్యవస్థను ఉద్యోగం పొందడానికి మాత్రమే పరిమితం చేయడం ఒక పెద్ద సామాజిక అన్యాయం. బీసీలు మొదటి స్థాయి ఉద్యోగాల్లోకి ప్రవేశం పొందిన అ ధికార స్థాయిలకు చేరకుండా అడ్డుకట్టలు వేస్తున్నారు. ఇది యాదృచ్చికం కాదు; ఇది ఒక నిర్మాణాత్మక అసమానత. ఉద్యోగం ఇచ్చి, ప్రమోషన్లు ఎందుకు ఇవ్వరు? ఎం ట్రీ ఇస్తారు కానీ, ఎదుగనివ్వరు. నేటికి నిర్ణయాలు తీసుకునే స్థానాలు ఆధిపత్య వర్గా ల చేతుల్లోనే ఉన్నాయి. ఇప్పుడు ప్ర శ్నించాల్సిన సమయం వచ్చింది: ఉద్యోగం ఒకటే సరిపోతుందా, అధికారంలో భాగస్వామ్యం వద్దా? అని. ప్రమోషన్ లేకుం డా రిజర్వేషన్ అర్థం లేనిది.
ఒక ఉద్యోగ జీవితంలో అసలు ప్రగతి, ప్రమోషన్ ద్వా రానే జరుగుతుంది. ప్రమోషన్ ద్వారా జీ తం పెరుగుతుంది, నిర్ణయాధికారం వస్తుం ది, విధానాలను ప్రభావితం చేసే స్థాయికి చేరుతాడు, హోదా పెరుగుతుంది. కానీ, బీసీలు ఈ మెట్టుకు వెళ్లకుండా అడ్డుకుం టే, రిజర్వేషన్ కేవలం ‘ప్రవేశ పాస్’గానే మిగిలిపోతుంది. మరి బీసీల ఓట్లు మా త్రం రాజకీయ పార్టీలకు కావాలి. అడగకుండానే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు వారం రోజుల్లో ఈ దేశంలో అమలు చేస్తారు. అదే విధంగా, మహిళా బిల్లును పార్లమెంట్‌లో ఆగమేఘాల మీద ప్రవేశపెడతారు. కానీ, బీసీల హక్కుల విషయం వచ్చినప్పుడు, దాన్ని రాకుండా ఎలా అడ్డుకో వాలనే దానిపైన అన్ని రాజకీయ పార్టీలు ఒకటై వ్యవహరిస్తూ ఉన్నాయి. మరి ఇలా జరిగినప్పుడు బీసీలకు సామాజిక న్యా యం ఎలా సాధ్యమవుతుంది?
రాజ్యాంగం ప్రవచించిన సమానత్వం సాధ్యం కావాలంటే బీసీలకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు తప్పనిసరి. సమానత్వం అంటే కేవలం ఒక తలుపు తెరవడం కాదు, అందరూ ఒకే మెట్టుపై నిలబడేలాగా చేయడం. బీసీలను ఎంట్రీ దగ్గరే నిలిపి పై స్థాయిలోకి వెళ్లనివ్వకపోతే అది అసమానత్వాన్ని కొనసాగించే విధానమే అవుతుం ది. అయితే బీసీ సంఘాలు ఒక విషయా న్ని గుర్తుపెట్టుకోవాలి: ప్రభుత్వాలు అడగందే ఎప్పటికీ ఇవ్వవు.
బీసీ సంఘాలు, బీసీ ఉద్యోగ సంఘాలు, పెద్దఎత్తున ఉద్యమించి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలి. అలా గే ఇప్పుడున్నటువంటి సమాచారం ఆధారంగా న్యాయస్థానాల్లో కూడా పోరాటం చేయాలి. అప్పుడే ప్రభుత్వాలు దిగివచ్చి రాజ్యాంగ సవరణకు పూనుకుంటాయి, ప్రమోషన్లలో రిజర్వేషన్లు సాధ్యమవుతా యి. ఈ ధర్మ, న్యాయబద్ధమైన పోరాటంలో బీసీ ఇంటెలెక్చువల్స్ ఫోరమ్ మీకు ఎప్పడు అండగా ఉంటుంది.
వ్యాసకర్త: విశ్రాంత ఐఏఎస్, బీసీ ఇంటెలెక్చువల్స్ ఫోరమ్ చైర్మన్






