22-01-2026 05:47:23 PM
కుమరం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): జిల్లా కేంద్రంలో నిర్వహించిన జిల్లా స్థాయి సమావేశంలో రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు, తపస్ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యుడు బండి రమేష్ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్ష, కార్యదర్శులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తపస్ జిల్లా అధ్యక్షుడిగా ఆడే శ్రావణ్ కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శిగా రాచర్ల మధు వర్మను అధికారికంగా ప్రకటించారు.ఈ సందర్భంగా నూతన జిల్లా అధ్యక్షుడు ఆడే శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ ఉపాధ్యాయులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తామని, తపస్‌ను జిల్లాలో మరింత విస్తరించే దిశగా పనిచేస్తామని హామీ ఇచ్చారు.ఈ సమావేశంలో తపస్ సభ్యులు వినయ్, సతీష్, సంతోష్, నగేష్, వెంకటేష్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.