22-01-2026 05:50:12 PM
(విజయక్రాంతి): విశ్వవిద్యాలయాలలో పనిచేస్తున్న పార్ట్ టైం, కాంట్రాక్ట్ అధ్యాపకుల సమస్యలను శాసనమండలిలో ప్రస్తావిస్తానని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న హామీ ఇచ్చారు. యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో మల్లన్నతో జరిగిన అధ్యాపకుల ఆత్మీయ సమావేశంలో అధ్యాపకులు డాక్టర్ తిరునహరి శేషు, డాక్టర్ చింతం ప్రవీణ్, డాక్టర్ సునీత, డాక్టర్ చందూలాల్,డాక్టర్ వెన్నంపల్లి విజయకుమార్, డాక్టర్ తాళ్లపల్లి సంజీవ్, డాక్టర్ రచ్చ కళ్యాణి, డాక్టర్ హరిదాస్యం రమాదేవి, పార్ట్ టైం అధ్యాపకుల సమస్యలను కాంట్రాక్ట్ అధ్యాపకుల సమస్యలను మల్లన్న దృష్టికి తీసుకెళ్లిన సందర్భంగా ఎమ్మెల్సీ మల్లన్న స్పందిస్తూ విశ్వవిద్యాలయాలలో నెలకొన్న విద్యార్థుల, అధ్యాపకుల సమస్యలను పరిష్కరించడానికి తెలంగాణ రాజ్యాధికార పార్టీ ద్వారా ప్రభుత్వం పై ఒత్తిడి తెస్తామని హామీ ఇచ్చారు. గతంలో ఉద్యమానికి మద్దతు ఇచ్చానని, ప్రొఫెసర్ సస్పెన్షన్ జోక్యం చేసుకున్నానని తెలియజేస్తూ భవిష్యత్తులో విశ్వవిద్యాలయాలలో నెలకొని ఉన్న సమస్యల పరిష్కారం కోసం పార్టీ ఆధ్వర్యంలో విశ్వవిద్యాలయాల, న్యాయ యాత్ర చేపడతానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మంథని శంకర్, డాక్టర్ బాలు, డాక్టర్ సురేష్, డాక్టర్ చందర్, డాక్టర్ లక్ష్మీనారాయణ, డాక్టర్ ఫరా ఫాతిమా, డాక్టర్ మాధవి, డాక్టర్ సదానందం, డాక్టర్ హరికుమార్ తదితరులు పాల్గొన్నారు.