calender_icon.png 11 December, 2025 | 11:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బంగారాన్ని మించి వెండి పరుగులు

11-12-2025 12:15:50 AM

కిలో వెండి ధర రూ.2 లక్షల మార్కుకు చేరువ

హైదరాబాద్, డిసెంబర్ 10: బంగారాన్ని మించి వెండి ధరలు పరుగులు పెడుతుంది. ధరల గురించి అందరూ మాట్లాడుకుంటున్న వేళ, వెండి అనూహ్యంగా దూసుకుపోతోంది. దేశీయ మార్కెట్లో కిలో వెండి ధర రూ.2 లక్షల మార్కుకు అత్యంత చేరువగా వచ్చింది. బుధవారం హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో కిలో వెండి ధర ఏకంగా రూ.1.92 లక్షలు పలికింది.

ఈ అనూహ్య పెరుగుదల వెనుక అంతర్జాతీయ పరిణామాలు, పారిశ్రామిక డిమాండ్ ప్రధాన కారణంగా ఉన్నాయి.అంతర్జాతీయ మార్కెట్లో వెండి ధర చరిత్రలో తొలిసారిగా ఔన్సుకు 60 డాలర్ల మార్కును దాటింది. బుధవారం ట్రేడింగ్‌లో ఔన్సు వెం డి ధర 61. 49 డాలర్ల వద్దకు చేరింది.  హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.1.32 లక్షలుగా ఉంది.