calender_icon.png 13 December, 2025 | 2:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భారత్‌లో గ్లోబల్ ప్రీమియర్‌లో సరికొత్త సెల్టోస్

11-12-2025 12:41:37 AM

హైదరాబాద్, డిసెంబర్ 10 (విజయక్రాంతి): ఎస్యూవీ నాయకత్వాన్ని పెద్ద కొలతలు, మెరుగైన భద్రత, అత్యాధు నిక వినూత్నతలతో పునర్నిర్వచించే అద్భుతమైన ఉత్పత్తిని అందించాలనే నిబద్ధతకు అనుగుణంగా, కియా ఇండియా బుధవారం సరికొత్త కియా సెల్టోస్ను ఆవిష్కరించింది. ఇది సెగ్మెంట్ బెంచ్మార్క్- సెట్టర్ తిరిగి రావడాన్ని సూచిస్తుంది. భారతదేశంలో అత్యంత ప్రియమైన ఎస్యూవీలలో ఒకటైన ఇది బోల్ కొత్త స్టైలింగ్, ప్రీమియం ఇంటీరియర్లతో పాటు విభిన్న కస్టమర్ అవసరాలకు అనుగుణంగా బహుముఖ ట్రిమ్స్, పవర్ట్రెయిన్ల ను కలిగి ఉంది.

డిసెంబర్ 11వ తేదీ అర్ధరాత్రి నుండి దేశవ్యాప్తంగా బుకింగ్లు ప్రారం భమవుతాయి. దీని ద్వారా వినియోగదారులు రూ.25,000 ప్రారంభ మొత్తంతో తమకు ఇష్టమైన ఎస్యూవీని రిజర్వ్ చేసుకోవచ్చు. ఈ ఎస్యూవీ, సెగ్మెంట్లో 4,460 ఎంఎం పొడవు, 1,830 ఎంఎం వెడల్పుతో ఉన్న ఆకట్టుకునే కొత్త డిజైన్‌తో తిరిగి వచ్చింది.

75.18 సెం.మీ (30-అంగుళాల) ట్రినిటీ పనోరమిక్ డిస్ప్లే ప్యానెల్, కారులో మరింత మెరుగైన నిమగ్నత కోసం ఇమ్మర్సివ్ ప్రీమియం బోస్ 8-స్పీకర్ ఆడియోను కలిగి ఉంది. కియా ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ గ్వాంగు లీ మాట్లాడుతూ, కొత్త కియా సెల్టోస్ ఒక జనరేషన్ మార్పు కంటే ఎక్కువ; ఇది ఈ విభాగాన్ని పునర్నిర్వచించాలనే కియా ఉద్దేశ్యానికి నిదర్శనం అన్నారు.