8 July, 2026 | 5:41 PM

నిజామాబాద్ ఇన్చార్జి సిపిగా సింధూ శర్మ

19-10-2024 05:01 PM

కామారెడ్డి (విజయక్రాంతి): నిజామాబాద్ ఇన్చార్జి పోలీస్ కమిషనర్ గా కామారెడ్డి జిల్లా ఎస్పీ సింధు శర్మను ప్రభుత్వం శనివారం నియమించింది. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ గా పని చేసిన కల్మేశ్వర్ శుక్రవారం బదిలీ అయిన విషయం విధితమే. కొత్త పోలీస్ కమిషనర్ వచ్చేవరకు కామారెడ్డి ఎస్పీగా పనిచేస్తున్న సింధు శర్మ ఇన్చార్జి పోలీస్ కమిషనర్ గా కొనసాగనున్నారు.