17 April, 2026 | 11:13 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

సింగరేణి మ్యూజియంను ఏర్పాటు చేయాలి

04-06-2025 09:00 PM

రామకృష్ణాపూర్ (విజయక్రాంతి): కోల్ బెల్ట్ ఏరియాలో సిరులవల్లి సింగరేణి చరిత్రకు సంబంధించిన ఓ సింగరేణి మ్యూజియంలను ఏర్పాటు చేయాలని క్యాతన్ పల్లి మాజీ సర్పంచ్, తెలంగాణ రాష్ట్ర విద్యావంతుల ఐక్య వేదిక అధ్యక్షుడు గురజాల రవీందర్ రావు(President Gurajala Ravinder Rao) అన్నారు. బుధవారం రామకృష్ణాపూర్ పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సింగరేణి ఘనతను తెలిపేందుకు మ్యూజియం ఏర్పాటు కీలకం అని అన్నారు. సింగరేణి చరిత్రను భావితరాలకు తెలియజేయడం సులభంగా అర్థం అవుతుందని గురజాల రవీందర్ రావు అన్నారు.

కొత్తగూడెం నుండి మొదలు బెల్లంపల్లి వరకు కనీసం మూడు సింగరేణి మ్యూజియంలు ఏర్పాటు చేసేలా అధికారులు కృషి చేయాలని కోరారు. అలాగే ఓ మొబైల్ మ్యూజియంను ఏర్పాటు చేయడం వల్ల సింగరేణి ఘనతను,అప్పటి ట్రేడ్ యూనియన్ల నాయకత్వాన్ని,కార్మికుల పనితీరును ఊరరా తెలియజేయడం చాలా సులభతరం అవుతుందని అన్నారు.త్వరలోనే సింగరేణి సీఅండ్ఎండి బలరాం నాయక్ ను కలిసి సింగరేణి మ్యూజియం ఏర్పాటు చేసేలా మెమరండం అందించి వివరిస్తామని అన్నారు.