04-07-2025 12:29:05 AM
- జిఎంకు పదవిపై ఉన్న శ్రద్ద ఏరియాలోని యవత సంక్షేమంపై లేదు
- సంప్రిత్ మృతికి సింగరేణి యాజమాన్యమే బాధ్యత వహించాలి
- మురళి మాన్ పవర్ సెక్యూరిటీపై కఠిన చర్యలు చేపట్టాలి
- మృతుని కుటుంబానికి న్యాయం చేయాలి
- సామాజిక కార్యకర్త, న్యాయవాది కర్నే రవి
మణుగూరు, జూలై 3 (విజయక్రాంతి): సింగరేణి జిఎం నిర్లక్ష్యంతోనే నిండు ప్రాణం బలైందని, ఆయనకు పదవిపై ఉన్న శ్రద్ద ఏరియాలోని నిర్వాసిత, యవత సంక్షేమంపై లేద ని,సామాజిక కార్యకర్త, న్యాయవాది కర్నెరవి విమర్శించారు. మురళి మాన్ పవర్ సింగరేణి (సెక్యూరిటీ) స్థానిక యువత ప్రాణాలను బలి తీసుకుంటుందని ఆగ్రహించారు.అమాయక గిరిజన బిడ్డ సంప్రిత్ కు ప్రైవేటు సెక్యూరిటీలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ ఓ దళారీ రూ1.50 లక్షలు తీసుకోని, ఉద్యోగంఇవ్వకపోగా తరచు డబ్బుల కోసం మురళి మాన్ పవర్ (సెక్యూరిటీ) ఉద్యోగుల వేధింపులకు పాల్పడడంతో, మోసపోయానని తెలుసుకొని, ఉద్యోగం రాక, మనస్థాపంతో పురు గుల మందు తాగి మృతి చెందడం బాధాకరమన్నారు.
గు రువారం రవి సంప్రిత్ మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ. సింగరేణి అధి కారులు, భూ నిర్వాసిత, యువత సంక్షేమాన్ని విస్మరించారని, సంప్రీత్ మృతికి సింగరేణి యాజమాన్యం, స్థానిక జిఎం బాధ్యత వహించాలని, ఆయన డిమాండ్ చేశారు. సెక్యూరిటీ ఉద్యోగాల పేరుతోయువతను మోసం చేసి, వారి ప్రాణాలతో చెలగాటమాడుతున్న మురళి మాన్ పవర్ సెక్యూరిటీ ఫై చట్టరీత్యా కఠిన చర్యలు చేపట్టాలని, ఆ యాజమాన్యంపై క్రిమినల్ కేసులో నమోదు చేయాలన్నారు. మృతుని కుటుంబానికి సింగరేణి యాజమాన్యం రూ.కోటి రూపాయలు చెల్లించాలని, ఆ కుటుంబంలో ఒకరికి సింగరేణి ఉద్యోగం ఇచ్చి కు టుంబానికి న్యాయం చేయాలని ఆయన సింగరేణి సీఅండ్ ఎండి బలరాం నాయక్, సింగరేణి డైరెక్టర్ (పా) లకు విజ్ఞప్తి చేశారు.పూనెం సంప్రీత్ కుటుంబానికి న్యాయం చేసేందుకు కార్మిక సంఘాల నాయకులు కలిసి రావాలని కోరారు.మరో వైపు సింగరేణిలో ఔట్సోర్సింగ్ కార్మికులతో వెట్టిచాకిరీ చే యిం చుకొని, రాజ్యాంగంలో ఉన్నహక్కులను అమలు చేయడం లేదని, సింగరేణి యాజమాన్యంలో కొందరు అధికారుల తీరుతో కార్మికులు ను బజారునపడుతు న్నారని, ఏరియాలో సింగరేణి అధికారుల తీరు అస్తవ్యస్తంగా మారిందని, సంప్రీత్ మృతి పైసింగరేణి యాజమాన్యం పూర్తి స్థాయిలో విచారణ జరిపించి, మృతుని కుటుంబానికి న్యా యం చేయాలన్నారు. లేనిచో యువతతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని, సింగరేణి యాజమాన్యాన్ని రవి హెచ్చరించారు.