calender_icon.png 4 July, 2025 | 2:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎం సభను విజయవంతం చేయండి

04-07-2025 12:27:44 AM

ఎమ్మెల్యే మందుల సామెల్

శాలిగౌరారం, జూలై 3: తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరి మండల కేంద్రంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు ఎనుముల రేవంత్ రెడ్డి హాజరవుతున్నారని, కార్యకర్తలు భారీ సంఖ్య లో పాల్గొని విజయవంతం చేయాలని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల అన్నారు.

గురువారం శాలిగౌరారం  మండల కేంద్రంలోని జిబిఎం  ఫంక్షన్ హాల్ లో  ముఖ్య కార్యకర్తల సన్నాహక సమావేశం జరిగింది. సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం తోనే  పేదల సంక్షేమం సాధ్యమని, ఆరు అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందుతాయని అయన అన్నారు.

ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పాదూరి శంకర్ రెడ్డి, మండల అధ్యక్షులు కందాల సమరం రెడ్డి,డీసిసి ఉపాధ్యక్షులు అన్నె బోయిన సుధాకర్, గూని వెంకటయ్య,తాళ్లూరి మురళి, నరిగి నరసింహ,భూపతి వెంకన్న,వేముల గోపీనాథ్, బోడ అరుణ్ కుమార్,బొల్లి కొండ గణేష్,నోముల రవి, ఇబ్రహీం,బందెల శీను, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.