14-07-2025 02:36:12 AM
-మొదటి వింబుల్డన్ కైవసం
-ఫైనల్లో అల్కరాజ్‌పై విజయం
లండన్, జూలై 13: వింబుల్డన్ విజేతగా జానిక్ సిన్నర్ (ఇటలీ) నిలిచాడు. ఆదివారం జరిగిన ఫైనల్లో కార్లోస్ అల్కరాజ్ (స్పెయిన్)పై 4 6 6 6 తేడాతో విజయం సాధించాడు. గ్రాస్ కోర్టు రారాజుగా నిలిచిన సిన్నర్ వింబుల్డన్‌ను కైవసం చేసుకోవడం ఇదే తొలిసారి. నువ్వునేనా అన్నట్లు సాగిన ఫైనల్‌లో సిన్నర్ తొలి సెట్ కోల్పోయినా కానీ తర్వాత అద్భుత రీతిలో పుంజుకుని మ్యాచ్‌ను కైవసం చేసుకున్నాడు. వరుస సెట్లలో అల్కరాజ్‌ను ఓడించి వింబుల్డన్ విజేతగా నిలిచాడు.
ఈ మ్యాచ్‌లో విజేతగా నిలిచిన సిన్నర్ 8 ఏస్‌లను సంధించగా.. ఓటమి పాలైన అల్కరాజ్ 15 ఏస్‌లు సంధించడం విశేషం. ఎక్కువ ఏస్‌లు సంధించినా కానీ ఏడు తప్పిదాలతో అల్కరాజ్ మూల్యం చెల్లించుకున్నాడు. సుదీర్ఘంగా ర్యాలీలతో మ్యాచ్ ఆధ్యంతం ఆసక్తిగా సాగిం ది. గతేడాది వింబుల్డన్‌ను గెలుచుకున్న అల్కరాజ్ ఈ సారి మాత్రం రన్నరప్‌గా నిలిచాడు. పోయినేడాది క్వార్టర్ ఫైనల్‌కే పరిమితమైన సిన్నర్ ఈ ఏడు మాత్రం ఏకంగా టైటిల్‌నే ఎగరేసుకుపోయాడు.