ఎన్నికల అధికారుల ద్వారా ఎస్‌ఐఆర్
ఎన్యూమరేషన్ ఫారం అందుకున్న ఎంపీ డా.కె లక్ష్మణ్
ముషీరాబాద్, జూన్ 29 (విజయక్రాంతి): ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక సమగ్ర ఓటర్ల ప్రక్షాళన కార్యక్రమం లో భాగంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) ఎనుమరెషన్ ఫారం ను ఓబీసీ మోర్చ జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ ఎంపి డా. కె లక్ష్మణ్ అశోక్ నగర్ లోని ఆయన నివాసంలో ఎన్నికల అధికారులు ఈఆర్‌ఓ ప్రవీణ్ రెడ్డి, ఏఈఆర్వో పుష్ప లత కలిసి అందచేశా రు.
ఈ సందర్భంగా ఎంపీ డా. లక్ష్మణ్ మాట్లాడుతూ ప్రస్తుతం జరుగుతున్న ఎస్‌ఐఆర్ -స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది, మన బూత్ స్థాయి నాయకులు చురుకుగా పాల్గొనాలని సూచించారు. ప్రతి అర్హుడైన ఓటరును ఓటర్ల జాబితాలో నమోదు చేయించాలన్నారు. డూప్లికేట్, మల్టిపుల్, మరణించిన వారి, బోగస్ ఎంట్రీలను గుర్తించి ఓటర్ల జాబితా నుండి తొలగించేలా చూడాలన్నారు.
పరిశుద్ధమైన ఓటర్ల జాబితాయే బలమైన ప్రజాస్వామ్యానికి పునాది అని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్, ఓబీసీ మోర్చ జాతీయ కార్యవర్గ సభ్యుడు పూస రాజు, యువ నాయకులు కోవ రాహుల్ తదితరులు పాల్గొన్నారు.






