09-12-2025 10:55:46 PM
సిర్పూర్ శాసనసభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు..
బెజ్జూర్ (విజయక్రాంతి): చింతలమానేపల్లి, బెజ్జూర్ మండలాల్లోని రుద్రాపూర్, ముంజంపల్లి, బారెగూడ గ్రామాల సర్పంచ్ అభ్యర్థులు గోగుల శంకరమ్మ లక్మయ్య, పొర్శెట్టి వెంకటాచలం, తేలి సుశీల బాపుకు మద్దతుగా ఎన్నికల ప్రచారం సిర్పూర్ శాసనసభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అవినీతిపరులను గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓడించాలని, మంచివారికి అండగా నిలవాలని గ్రామస్తులను కోరారు. ప్రాణహిత కాలువ భూసేకరణ విషయంలో అవినీతికి పాల్పడిన నాయకులు మళ్లీ కొత్త వేషం వేసుకొని వస్తున్నారని, వారికి తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.
ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద రోడ్డు కనెక్టివిటీ లేని గ్రామాలకు కొత్తగా రోడ్లు నిర్మించనున్నామని, గ్రామాల్లోని అంతర్గత రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం కోసం జాతీయ ఉపాధి హామీ పథకం కింద నిధులు, వినియోగించనున్నామని తెలిపారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీకి చెందిన మురళీ గౌడ్, తలండీ భిక్షపతి, డబ్బా తిరుపతి తదితరులు భాజపాలో చేరారు. వీరికి ఎమ్మెల్యే భాజపా కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో సిర్పూర్ అసెంబ్లీ కన్వీనర్ గొల్లపల్లి వీరభద్ర చారి, మండల అధ్యక్షులు జాడి దిగంబర్, మాజీ జడ్పీటీసీ ఎల్ములే మల్లయ్య, దయన్న, మాజీ సర్పంచ్లు వసీ ఉల్లఖాన్, గూడ రాకేష్, మాజీ ఉప సర్పంచ్లు తిరుపతి, సంతోష్ సిడామ్, దుర్గం కారు, మోర్లే బాబురావు, కోల కిష్టయ్య, డుబ్బుల నారాయణ, ఋషి, రవి, శ్రావణ్ గౌడ్, అంకులు, మారుతి, కార్తీక్ వార్డు మెంబర్లు, తదితరులు పాల్గొన్నారు.