09-12-2025 10:51:40 PM
మిర్యాలగూడ (విజయక్రాంతి): మంగళవారం మిర్యాలగూడ నియోజకవర్గ పరిధిలోని దామరచర్ల మండల పరిధిలోని వాడపల్లి గ్రామంలో భారత రాష్ట్ర సమితి బలపరిచిన అభ్యర్థి ఆలేటి సంధ్య, మిర్యాలగూడ మండలం తుంగపాడు అవాస గ్రామం రామన్నపేటలో భారత రాష్ట్ర సమితి బలపరిచిన అభ్యర్థి తుమ్మల ఫణికుమార్ గెలుపుకై మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు ఇంటింటి ప్రచారాన్ని చేపట్టి వారికి కేటాయించబడిన గుర్తులపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎం.డి. యూసుఫ్, కామేపల్లి శ్రీనివాసరెడ్డి, అనంతలక్ష్మి, చిట్టిపోలు సైదయ్య, లాల్ అహ్మద్, భారత రాష్ట్ర సమితి నాయకులు, సజ్జల శ్రీనివాస్ రెడ్డి, బత్తుల లక్ష్మయ్య, బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.