calender_icon.png 10 December, 2025 | 2:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణ ఆత్మగౌరవం గెలిచిన రోజు..

09-12-2025 10:59:59 PM

బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య..

బెల్లంపల్లి (విజయక్రాంతి): తెలంగాణ కోసం కేసీఆర్ తన ప్రాణాలను పణంగా పెట్టి నిరహార దీక్ష చేసిన చారిత్రక దినం విజయ్ దివాస్ ను మంగళవారం ఘనంగా నిర్వహించారు. బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తల్లి తెలంగాణ విగ్రహానికి క్షీరాభిషేకం చేసి, అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. సందర్భంగా మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమ రథసారథి కేసీఆర్ 11 రోజుల పాటు ఆమరణ దీక్ష చేసి, ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ ప్రకటన వెలువడేలా చేశారని తెలిపారు. ఈ చారిత్రక రోజు కేసీఆర్ ఉక్కు సంకల్పం ముందు కేంద్రం తలొగ్గి, తెలంగాణ ప్రకటించిందన్నారు. ఆనాడు సమైక్య ఆంధ్ర నాయకులు తెలంగాణ అనే పదాన్ని నిషేధించారనీ తెలిపారు.

ఎక్కడ మాట్లాడినా వెనుకబడ్డ ప్రాంతం అనేవారు అలాంటి ఆస్తిత్వమే లేని పరిస్థితుల నుండి సగర్వంగా నాది తెలంగాణ అని చెప్పుకునే స్థాయికి వచ్చిందంటే దానికి కారణం కేసీఆర్ అని పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పాటును ప్రకటించిన రోజు సందర్భంగా తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసి అలాగే, అంబేద్కర్ విగ్రహానికి, పూలమాల వేసి ఆ మహనీయులను స్మరించుకున్నట్లూ తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ బెల్లంపల్లి పట్టణ అధ్యక్షుడు నూనెటి సత్యనారాయణ, పట్టణ జనరల్ సెక్రెటరీ విజయకుమార్, బెల్లంపల్లి యువజన అధ్యక్షుడు సబ్బని అరుణ్ కుమార్, సీనియర్ నాయకులు సుందర్ రావు మైనార్టీ అధ్యక్షుడు అలి, కలిం, ఖలీల్, హనీఫ్, కాంపెల్లి రాజం, మధ్యల గోపి, గద్దల ధర్మేందర్, కార్యకర్తలు పాల్గొన్నారు.